కళ్యాణ్ రామ్.. నారా రోహిత్ లకు అంత బడ్జెట్టా?

Update: 2019-11-26 14:10 GMT
కథను బట్టి బడ్జెట్ పెట్టాలా.. హీరో మార్కెట్ ను బట్టి బడ్జెట్ డిసైడ్ చెయ్యాలా.. దర్శకుడి స్టామినాను బట్టి బడ్జెట్ నిర్ణయించాలా? నిజానికి కథను బట్టే బడ్జెట్ పెట్టాలని చాలామంది అంటారు.  కానీ అలా చేస్తే రికవరీపై ఆశలు దాదాపుగా వదులుకోవాల్సిందే.  అందుకే ప్రాక్టికల్ గా ఆలోచించి హీరో మార్కెట్ ను బట్టే పెట్టుబడి ఎంత పెట్టాలనేది నిర్ణయించాలి.  ఒక్క రాజమౌళి సినిమాలకు మాత్రమే ఈ రూల్ వర్తించదు. అయితే చాలా సందర్భాలలో మన ఫిలిం మేకర్లు హీరో మార్కెట్ ను మించి పెట్టుబడి పెడుతుంటారు.

నందమూరి ఫ్యామిలీలో బాలయ్య బాబు.. ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్లే కాకుండా కళ్యాణ్ రామ్.. నారా రోహిత్ లాంటి మిడ్ రేంజ్ హీరోలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ హీరోల సినిమాల బడ్జెట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.  కళ్యాణ్ రామ్ ఈమధ్య ఒక డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  ఈ సినిమాకు బడ్జెట్ రూ.30 కోట్లు పెడుతున్నారట. మరో వైపు నారా రోహిత్ నటించే కొత్త సినిమాకు రూ.28 కోట్లు బడ్జెట్ గా నిర్ణయించారట.  అయితే ఈ ఇద్దరి మార్కెట్ ముప్పై కోట్ల రేంజ్ లో లేదనేది అందరికీ తెలిసిందే.  కళ్యాణ్ రామ్ సినిమాలు హిట్ అయితే 15-20 కోట్ల రేంజ్ లో కలెక్ట్ చేస్తాయి కానీ నారా రోహిత్ సినిమాలకు ఈమధ్య కలెక్షన్స్ రావడం గగనంగా మారింది.  ఇలాంటి పరిస్థితిలో ఈ హీరోలు అంత బడ్జెట్లను వెనక్కు తీసుకురాగలరా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కథ ఎంత మంచిది అయినా.. బడ్జెట్ పెరిగిపోతే బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకోవడం చాలా కష్టం.  ఈమధ్య పెద్ద స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిల పడడానికి కారణం మితి మీరిన బడ్జెట్లే.  అనవసరపు బడ్జెట్ పెట్టకపోతే ఆ సినిమాలు హిట్ ముద్ర వేయించుకునేవి.  మరి ఈ మిడ్ రేంజ్ నందమూరి హీరోలు బడ్జెట్ ను తగ్గించే విషయంపై దృష్టి సారించడం మేలని ఇండస్ట్రీలో కొందరు సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News