బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి విలన్ రోల్స్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్టు రోల్స్ ను చేస్తున్నాడు. కేజీఎఫ్ 2 లో సంజయ్ దత్ పాత్రకు మంచి పేరు దక్కింది. పాత్ర నిడివి చాలా తక్కువే అయినా కూడా సంజయ్ దత్ యొక్క అప్పియరెన్స్ మరియు ఆయన ఉన్న సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. దాంతో సంజయ్ దత్ క్రేజ్ విపరీతంగా పెరిగింది.
సంజయ్ దత్ వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సమయం లోనే సౌత్ నుండి కూడా ఆయనకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సౌత్ సినిమాల్లో నటించేందుకు గాను సంజయ్ దత్ ఏకంగా రూ.10 కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తున్నాడట.
సంజయ్ దత్ కు పది కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సౌత్ నిర్మాతలు ఆసక్తి చూపించడం లేదు.
ఆ మధ్య ఒక తెలుగు సీనియర్ స్టార్ హీరో సినిమాలో ఆయన్ను నటింపజేసేందుకు ప్రయత్నించి పది కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం తో నీకో నమస్కారం దత్ భాయ్ అంటూ వెనక్కి వచ్చేశారట.
ఆయన పారితోషికం తెలిసిన తర్వాత చాలా మంది కనీసం ఆయనకు కథ చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. సంజయ్ దత్ యొక్క మార్కెట్ స్థాయి అంత కాదు. పైగా తెలుగు మరియు ఇతర సౌత్ భాషల్లో ఆయనకు ఇప్పుడు.. అప్పుడు ఎప్పడు కూడా పెద్దగా క్రేజ్ అయితే లేదు.
కేజీఎఫ్ 2 సక్సెస్ అయిన నేపథ్యంలో భారీ పారితోషికం పెంచడం విడ్డూరంగా ఉంది అంటూ విమర్శలు వస్తున్నాయి. సంజూ భాయ్ ఇప్పటికైనా తన బ్రాండ్ వాల్యూ ను తెలుసుకొని.. దానికి తగ్గట్లుగా తన యొక్క పారితోషికం నిర్ణయించుకోవాలని ఆయనతో వర్క్ చేయాలి అనుకుంటున్న వారు అంటున్నారు. మరి ఈయన రెమ్యూనరేషన్ తగ్గించుకుంటాడా.. ఆఫర్స్ వదులుకుంటాడా అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.