స‌మంత‌కు అనుష్క అంత క్రేజ్?

Update: 2018-08-19 04:38 GMT
అక్కినేని కోడ‌లు స‌మంత క్రేజు టాలీవుడ్‌ లో ఏ రేంజులో ఉంది?  దీనికి కొల‌మానం ఏమైనా ఉందా? అంటే దానికి స‌మాధానం అభిమానులే చెప్పాలి. ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో ఆద‌ర‌ణే స్టార్‌ డ‌మ్‌ కి కొల‌మానంగా మారింది. ఫ‌లానా స్టార్ ఫ‌స్ట్‌ లుక్ లేదా టీజ‌ర్‌ రిలీజ‌వుతోంది అంటే అభిమానుల్లో నెల‌కొనే ఆస‌క్తి ఏ స్థాయిలో ఉంది? అన్న‌దానిని బట్టి ట్విట్ట‌ర్‌ - ఇన్‌ స్టా వంటి చోట్ల క్లిక్కులు - లైక్‌ లు ప‌డుతున్నాయి. భారీగా వ్యూస్ వ‌స్తున్నాయి. కొన్ని గంట‌ల్లోనే ల‌క్ష‌ల మంది సామాజిక మాధ్య‌మాల్లో వీక్షించి స‌ద‌రు స్టార్‌కి ఉన్న ఫాలోయింగ్ ఇంత అని చూపిస్తున్నారు.

ఆ ర‌కంగా చూస్తే సామాజిక మాధ్య‌మాల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న న‌టీమ‌ణులుగా బాలీవుడ్‌ లో అనుష్క శ‌ర్మ‌ - దీపిక ప‌దుకొనే - స‌న్నీలియోన్ పేర్లు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. అదే టాలీవుడ్‌ కి వ‌స్తే ఇక్క‌డ ఏ ఇత‌ర క‌థానాయిక‌లతో పోల్చినా స‌మంత చాలా స్పీడ్‌ గా ఉంద‌న‌డంలో సందేహం లేదు. సామ్ న‌టించిన యూట‌ర్న్ టీజ‌ర్ ఇటీవ‌లే రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ టీజ‌ర్‌ కి ఇప్ప‌టికే 30ల‌క్ష‌ల వ్యూస్ ద‌క్కాయి. ఇదే స్పీడ్‌ లో కోటి వ్యూస్‌ కి చేరినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నేలేదు. ఇది సామ్‌ కి ఉన్న ఆద‌ర‌ణ‌కు సూచిక‌. అటు బాలీవుడ్‌ లో అనుష్క శ‌ర్మ‌కు ఉన్నంత క్రేజు ఇద‌ని చెప్పాలి.  ఇదివ‌ర‌కూ అనుష్క శ‌ర్మ న‌టించి నిర్మించిన `ఎన్‌ హెచ్ 10` టీజ‌ర్‌ ని కొన్ని గంట‌ల్లోనే కోటి మందిపైగా వీక్షించారు. ఇప్పుడు స‌మంత యూట‌ర్న్ టీజ‌ర్‌ కోటి వ్యూస్ దిశ‌గా వెళుతోంది. అక్క‌డ అనుష్క శ‌ర్మ నిర్మాత కం న‌టి, ఇక్క‌డ సామ్ సేమ్ టు సేమ్‌. ఆ ఇద్ద‌రి ఆద‌ర‌ణ ఆశ్చ‌ర్యం క‌లిగించేదే. ఫాలోయింగ్‌ ను బ‌ట్టే ఆద‌ర‌ణ‌.

ఈ హుషారులోనే స‌మంత యూట‌ర్న్ చిత్రంతో పాటు సీమ‌రాజా చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 13న రిలీజ్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. అదే రోజు ఇత‌ర సినిమాల నుంచి పోటీ ఉన్నా... వార్‌ లో స‌మంత దూసుకుపోవ‌డం ఖాయ‌మ‌ని అర్థ‌మ‌వుతోంది. త‌దుప‌రి  హ‌బ్బీ నాగ‌చైత‌న్య స‌ర‌స‌న సామ్ ఓ ప్రయోగాత్మ‌క చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News