హంట్‌ స్టోరీ లీక్‌ చేసిన సుధీర్‌బాబు

Update: 2023-01-18 00:30 GMT
సుధీర్ బాబు హీరోగా మహేష్ డైరెక్షన్‌లో భవ్య ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం హంట్. ఈ చిత్రం 26వ తేదీన విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలు పెట్టారు మేకర్స్. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు సుధీర్ బాబు. తాజాగా హీరో సుధీర్ బాబు ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లీక్ చేసేశారు.  

ఈ సినిమాలో తాను పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నానని ఒక యాక్సిడెంట్‌కి ముందు ఎంతో ధైర్యంగా ఉన్న పోలీసు అధికారి... యాక్సిడెంట్ తర్వాత పిరికివాడిగా మారతాడని.. ఆ రెండు ఆలోచనల మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు అనేది ఈ సినిమా కథ... అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో రిస్కీ ఫైట్స్‌కి డూప్ వాడలేదని రోప్ బెడ్ లాంటివి కూడా ఏవీ లేకుండానే ఫైట్స్ చేశామని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ఈ సినిమాలో అన్ని మరిచిపోయే రెండు షెడ్స్  ఉన్న అర్జునుడి పాత్ర తను పోషించానని తెలిపారు. జ్ఞాపకశక్తి కోల్పోక ముందు కోల్పోయాక..  అనే విధంగా పాత్ర ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

ఒకరకంగా చూసుకుంటే ఈ రెండు ఆలోచనల మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనేది సినిమా కథగా ఉంటుందని చెప్పుకొచ్చారు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నామని... ముందు నుంచి సినిమా యూనిట్ చెబుతోంది. హాలీవుడ్ వరువెల్ స్టూడియోస్ నిర్మించిన అనేక సినిమాలకు వర్క్ చేసిన వారు.. ఈ సినిమాకి స్టన్స్‌ కంపోజ్ చేశారు.

ఇక భవ్య ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. అరుణ్ విన్సెంట్ కెమెరా అందిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగానే సుధీర్ బాబు సినిమాలు అంటే మినిమం గ్యారంటీ అనే ప్రచారం ఉంటుంది. ఇప్పుడు సుధీర్ బాబు కూడా తన సినిమాని ఒక రేంజ్‌లో ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డారు. ఈ సందర్భాల్లోనే ఇలా లీక్ చేయడం ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News