బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ - మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. కంగన ముంబైని పీవోకేతో పోల్చడం.. ముంబై పోలీసులపై నమ్మకం లేదని వ్యాఖ్యానించడంతో శివసేన - కంగనాల మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది. ఇటీవల కంగనా కార్యాలయాన్ని అక్రమ నిర్మాణమంటూ మహా ప్రభుత్వం కూల్చివేయడంతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వంపై అలాగే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పై కంగనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ క్రమంలో గతంలో కంగనాపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు మహా ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఈ మేరకు ఇప్పటికే ముంబై పోలీసులను దర్యాప్తు చేయమని కోరినట్లు తెలుస్తోంది. నిషేధిత పదార్థాలు - నార్కోటిక్స్ డ్రగ్స్ ను కంగనా వాడతారనే ఆరోపణలను నిగ్గు తేల్చాల్సిందిగా ముంబై పోలీసులకు ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసిందని సమాచారం. అయితే కంగనా రనౌత్ గతంలో 'తానూ డ్రగ్ అడిక్ట్ నే' అని చెప్పిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా, కంగనా రనౌత్ 5 నెలల క్రితం 'నవరాత్రి 5వ రోజు' అంటూ ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో ద్వారా తాను 16 ఏళ్ళ వయస్సులో ఇంటి నుంచి పారిపోయి వచ్చి ఫిల్మ్ స్టార్ ని అయ్యానన.. అప్పుడే మత్తు మందులకు అలవాటు పడ్డానని కంగనా తెలిపింది. నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను.. ఎంతోమంది చేతిలో మోసపోయాను అని చెప్పుకొచ్చింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం కంగనాకు డ్రగ్స్ తో లింకులు ఉన్నాయని దర్యాప్తు చేయాలని చూస్తున్న సమయంలో ఈ వీడియోలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీనికి తోడు బాలీవుడ్ యాక్టర్ అధ్యయన్ సుమన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో 'కంగనా రనౌత్ కొకైన్ వాడతారని.. తనను కూడా డ్రగ్స్ తీసుకోవాలని కోరారని' సంచలన ఆరోపణలు చేశారు. దీని ఆధారంగా కంగనాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఆరోపణలు చేయగా.. దీనిపై కంగనా స్పందిస్తూ 'తాను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపించాలని.. డ్రగ్స్ టెస్ట్ కు తాను సిద్ధంగా ఉన్నానని.. తనకు డ్రగ్ మాఫియాతో లింకులు ఉన్నాయని రుజువైతే ముంబైలో ఎప్పుడూ అడుగుపెట్టనని' ట్వీట్ చేశారు. ఇలాంటి తరుణంలో కంగనా 'నేనూ డ్రగ్ అడిక్ట్ నే' అని చెప్పిన వీడియో బయటకు రావడం సంచలనమే అని చెప్పాలి.