తెలుగులో ‘ఛలో’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి మలి చిత్రం ‘గీత గోవిందం’తో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన విషయం తెల్సిందే. తెలుగులో రెండు మూడు సినిమాలకు కమిట్ అయిన ఈమె కన్నడంలో కూడా వరుసగా చిత్రాలు చేసుకుంటూ వస్తోంది. హీరోయిన్ గా స్టార్ డం దక్కించుకున్నా కూడా కొందరు కొందరి నీచమైన విమర్శలను రష్మిక ఎదుర్కొంటుందట. ఆ కామెంట్స్, విమర్శలు చూసి రష్మిక అప్పుడప్పుడు చాలా ఆవేదన చెందుతుందట. కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నప్పటి నుండి కూడా ఈమెను అక్కడి ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారట.
సోషల్ మీడియాతో పాటు బయటకు వెళ్లినా కూడా కొందరు రష్మికను సినీ కెరీర్ కోసం పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందని విమర్శిస్తున్నారట. విమర్శల కారణంగా రష్మిక తమిళ సినీ ఇండస్ట్రీని వదిలేయాలని కూడా అనుకుంటుందని ప్రచారం జరిగింది. కాని అవి పుకార్లే అని తేల్చిన రష్మిక తాజాగా కూడా కన్నడంలో ఒక చిత్రానికి సైన్ చేసింది. గీత గోవిందంలోని ముద్దు సీన్ గురించి కూడా ఈమెను కన్నడ ప్రేక్షకులు ట్రోల్ చేస్తున్నారట.
ఎవరెంతగా ట్రోల్ చేసినా కూడా వాటిని తట్టుకుని కెరీర్ లో ముందుకు సాగుతుంది. ప్రస్తుతం తెలుగులో ‘డియర్ కామ్రెడ్’ చిత్రంలో నటిస్తున్న రష్మిక నితిన్ హీరోగా రూపొందబోతున్న ఒక చిత్రంలో నటిచేందుకు ఓకే చెప్పింది. ఇక కన్నడంలో యజమన్న చిత్రంలో కూడా ఈమె నటిస్తూ ఇంకా అక్కడ రెండు సినిమాలకు సైన్ చేసింది. తనపై వస్తున్న విమర్శలకు కుంగి పోకుండా కెరీర్ లో ముందుకు సాగుతున్న ఆమెను అభిమానులు అభినందిస్తూ మరింతగా అభిమానిస్తున్నారు.