ఈ అబ్బాయికీ- అమ్మాయికి ఇళ‌య‌రాజా అతిథి!

Update: 2015-11-14 12:52 GMT
మ్యూజిక్ మేస్ర్టో ఇళయరాజా ఒక సినిమాకి పాటలు స్వరపరచాలంటే ముందు ఆయనకు కథ నచ్చాలి. ఆ త‌ర్వాత పాట‌ల ప్లేస్‌మెంట్ న‌చ్చాలి.  అందుకే ఇళయరాజా ఓ సినిమాకి పాటలు స్వరపరిస్తే.. కచ్చితంగా ఆ చిత్రకథలో దమ్ము ఉందని అనుకోవచ్చు. రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'అబ్బాయితో అమ్మాయి' ఈ కోవకే చెందుతుంద‌పి చెప్ప‌వ‌చ్చు.  

జేజి సినిమాస్ - కిరణ్ స్టూడియోస్ - బ్లూమింగ్ స్టార్స్ మోషన్ పిక్చర్స్ - మోహన్ రూపా ఫిలింస్ సంస్థలు నిర్మించిన చిత్రం 'అబ్బాయితో అమ్మాయి'. రమేశ్ వర్మ దర్శకత్వంలో వందన అలేఖ్య జక్కం, శ్రీనివాస్ సమ్మెట, కిరీటి పోతిని నిర్మించిన ఈ చిత్రానికి ఇళయరాజా పాటలు స్వరపరిచారు.

ఈ చిత్రం పాటలను ఈ నెల 18న విడుదల చేయనున్నారు. అత్యంత వైభవంగా హైదరాబాద్ లో జరగనున్న ఈ ఆడియో వేడుకలో చిత్ర సంగీతదర్శకుడు ఇళయరాజా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఇంకా పలువురు అతిరధ మహారధులు ఈ వేడుకలో పాల్గొంటారు.

 అయితే ఇళ‌య‌రాజా సంగీతం చేసినంత మాత్రాన సినిమా హిట్ అవుతుంద‌నే ప‌రిస్థితి లేదు ఇప్పుడు . ఇటీవ‌ల ఆయ‌న మ్యూజిక్ చేసిన చిత్రాలేవీ అంత‌గా ఆడిన దాఖ‌లాలు లేవు. పాట‌లు కూడా అంతంత‌మాత్రంగానే అనిపించాయి. గ‌తంలో ర‌మేష్ వ‌ర్మ చేసిన సినిమాలు కూడా పెద్ద‌గా ఆడినవి లేవు. మ‌రి ఈ అబ్బాయి అమ్మాయి అయినా ర‌మేష్ వ‌ర్మ‌కు మంచి బ్రేక్ ఇస్తారో చూద్దాం.
Tags:    

Similar News