సుశాంత్ కేసు : ఏది నిజం ఏది అబద్ధం...?

Update: 2020-08-13 02:30 GMT
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ జూన్ 14న ముంబైలోని తన ప్లాట్ లో అనుమానాస్పదరీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోజులు గడిచే కొద్దీ అనేక విషయాలు బయటకి వస్తున్నప్పటికీ ఈ కేసు విషయంలో క్లారిటీ రావడం లేదు. ముందుగా సుశాంత్ డిప్రెషన్ కి గురై సూసైడ్ చేసుకున్నాడని అందరూ అనుకున్నారు. దీనికి ఇండస్ట్రీలోని నెపోటిజం మరియు పలువురు వ్యక్తులు కారణమనే వాదనలు వినిపించాయి. ఆ తర్వాత సుశాంత్ ది ఆత్మహత్య కాదని.. అతన్ని ప్లాన్ ప్రకారమే హత్య చేసారని అనుమానాలు వ్యక్తం చేసారు. సుశాంత్ కేసులో దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు సుశాంత్ తో సన్నిహితంగా ఉన్నవారిని అతనితో పరిచయం ఉన్నవారిని విచారించారు. అయితే సుశాంత్ కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని.. ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు డిమాండ్ చేసారు.

ఇదిలా ఉండగా సుశాంత్ మరణించిన చాలా రోజులకు ఆ బాధ నుంచి కోలుకొని సుశాంత్ మరణానికి అతని ప్రియురాలు రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యులు కారణమంటూ అతని తండ్రి పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో ఈ కేసులోకి బీహార్ పోలీసులు కూడా ఎంటర్ అయ్యారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేసుపై విచారణ చేస్తున్న క్రమంలో ముంబై పోలీసులు బీహార్ పోలీసులకు సహకరించడం లేదని వార్తలు వచ్చాయి. దీనిపై సుశాంత్ తండ్రి బీహార్ సీఎం ని కలిసి ఈ కేసుని సీబీఐకి బదిలీ చేయాలని రిక్వెస్ట్ చేసారు. ఈ నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం సుశాంత్ ఆత్మహత్య కేసుని సీబీఐకి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం సుశాంత్ కేసుని సీబీఐకి అప్పగిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ రియాతో పాటు మరికొందరిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించింది. అదే సమయంలో ఈడీ అధికారులు నిందితులపై మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు.

అయితే ప్రసార మాధ్యమాల్లో రోజుకొక కొత్త కథనం వెలువడుతుండటంతో సుశాంత్ కేసులో ఏమి జరుగుతోందనే క్లారిటీ ఎవరికీ రావడం లేదు. కొంతమంది పొలిటికల్ లీడర్స్ హస్తం ఉందని ఒకసారి.. ఇండస్ట్రీలోని ప్రముఖులు కారణమని.. రియా నే అంతా చేసిందని.. అతని మేనేజర్ సూసైడ్ తో లింక్ ఉందని.. ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. మరోవైపు రియా చక్రవర్తి తనకు న్యాయం జరుగుతుందని చెప్తూ సుప్రీం కోర్టులో ఫైట్ చేస్తోంది. ఈడీ విచారణకు హాజరవుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు లేటెస్టుగా రియా చక్రవర్తి కాల్ లిస్ట్ బయటకి వచ్చిందని.. సుశాంత్ తో కంటే ఆమె అతని మాజీ మేనేజర్ తోనే ఎక్కువ కాల్స్ మాట్లాడిందని చెప్తున్నారు. దీంతో ఈ కేసులో ఏది నిజం ఏది అబద్ధం అనేది తేల్చుకోలేకపోతున్నారు. సీబీఐ విచారణ స్టార్ట్ చేయగానే దీనిపై ఓ క్లారిటీ వస్తుందనే నమ్మకం ఉంచినప్పటికీ రోజుకొక కొత్త విషయం తెలుస్తుండటంతో సుశాంత్ కేసులో ఎప్పటికి క్లారిటీ వస్తుందో అనేది అర్థం కాకుండా ఉంది.
Tags:    

Similar News