ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన `రెడ్` ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14 థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ ఆశించినంత విజయం దక్కించుకోలేదు. సిద్ధార్థ్ .. ఆదిత్య బ్రదర్స్ పాత్రల్లో రామ్ అద్భుతంగా నటించినా ఆశించిన ఫలితం దక్కలేదు.
రాపో ప్రస్తుతం తదుపరి సినిమాపై దృష్టి సారించారు. తాజా సమాచారం మేరకు ఫిబ్రవరి 23న రామ్ రెడ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగుకి రెడీ అవుతోంది. ఆ మేరకు పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీ కేవలం 40 రోజుల్లోనే డిజిటల్లో స్ట్రీమింగుకి వచ్చేస్తోంది. థియేటర్లలో వీక్షించలేని అభిమానులకు ఇది స్మార్ట్ ఫోన్లలోనే అందుబాటులోకి వచ్చేస్తోంది.
ఇక డిజిటల్ ఓటీటీ రిలీజ్ లకు కనీసం రెండు నెలల సమయం ఉండాలన్నది నిర్మాతల డిమాండ్. కానీ దానిని ఏనాడూ ఎవరూ పట్టించుకున్నది లేదు. సంక్రాంతి బరిలో రిలీజైన క్రాక్ ఇప్పటికే ఓటీటీలోనూ విశేష ఆదరణ దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 5 నుంచి ఆహాలో స్ట్రీమింగవుతోంది. క్రాక్ కేవలం 27 రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగుకి అందుబాటులోకి రావడం ఆసక్తికరం. దళపతి విజయ్ నటించిన `మాస్టర్` జనవరి 29 నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.