పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. రాజకీయాల్లో ఫుల్ టైం బిజీగా మారిన పవన్ కళ్యాణ్ రాజకీయ అవసరాల నిమిత్తం అంటూ మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్దం అయ్యాడు. తన 26వ చిత్రంగా పింక్ రీమేక్ తో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. పింక్ రీమేక్ వకీల్ సాబ్ సమ్మర్ చివర్లోనే విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా క్యాన్సిల్ అయ్యింది. వకీల్ సాబ్ విడుదల అయ్యి ఉంటే ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో సినిమా చకచక షూటింగ్ జరుగుతూ ఉండేది.
ఛారిత్రాత్మక చిత్రంగా పవన్ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. మొఘలుల కాలంలో గజ దొంగగా పవన్ కనిపించబోతున్నాడట. ఈ చిత్రానికి మొన్నటి వరకు విరూపాక్ష అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో పవన్ పాత్ర పేరు వీర అని సినిమాకు కూడా అదే టైటిల్ ను పెడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాని ఇప్పటికే వీర టైటిల్ ఉన్న కారణంగా టెక్నికల్ గా అది సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు.
వీర కు ముందు లేదా వెనుక ఏదైనా పదంను జత చేసి ఖరారు చేసే అవకాశం కూడా ఉందంటున్నారు. కిలాడీ వీర.. గజదొంగ వీర అనే టైటిల్స్ ను కూడా క్రిష్ అండ్ టీం పరిశీలిస్తున్నారట. వీర వజ్రం అనే టైటిల్ ను కూడా పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తున్నట్లుగా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది చివరికి సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు టైటిల్ విషయంలో క్రిష్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.