సమాజంలో స్త్రీల విషయంలో పురుషులు ఎలా ప్రవర్తిస్తున్నారనే దానిపై కొద్ది రోజుల క్రితం ధైర్యంగా నిలదీసే ప్రయత్నం చేసింది అమలాపాల్. సోషల్ మీడియా ద్వారా అమలా తీస్కున్న క్లాస్ ని యూత్ అంత తేలిగ్గా మర్చిపోలేరు. పాల్ లో ఇంత రెబలిజమా? అంటూ ముక్కున వేలేసుకున్నారు. అసలే ఓషో పుస్తకాలు చదివి రెబలిజాన్ని అలవాటు చేసుకుంటుందా? అంటూ కొందరు సెటైర్లు కూడా వేశారు. మాజీ భర్త ఏ.ఎల్.విజయ్ నుంచి విడిపోయాక అమలాపాల్ లో స్త్రీవాది మరో లెవల్లో నిదుర లేచింది! అంటూ యూత్ ఒకటే గుసగుసలు ఆడుకోవడం చూస్తున్నదే.
సంఘంలో పాతుకుపోయిన పురుషాధిక్యాన్ని.. దురహంకారాన్ని ప్రశ్నించిన అమలాపాల్ స్త్రీ స్వేచ్ఛ కోసం పరితపించిన తీరు కూడా ప్రజలకు నోటెడ్ అయ్యింది. అనాదిగా స్త్రీని తమ కోర్కెలు తీర్చుకునేందుకే పరుషుడు ఉపయోగించుకుంటున్నాడని .. గర్భధారణ వల్ల స్త్రీ ఎంతో నొప్పిని భరించాల్సి వస్తుందని.. పిల్లల్ని కనడం మరణంతో సమానం అని చాలానే క్లాస్ తీస్కుంది. తాజా పోస్ట్ లో మరోసారి అమలా తనను సమర్థించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. తనను తన భావజాలాన్ని అర్థం చేసుకుని అండగా నిలిచినందుకు సంతోషంగా ఉందని అంది. ``నేను నా కలల వెంట వెళ్లినప్పుడు ప్రజలు నాకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు`` అని తెలిపింది.
``నా కెరీర్ కలిసి వస్తోంది. నాలో స్పష్టత పెరిగింది. నా సర్కిల్ అందంగా ఉంది. నా జీవితం అభివృద్ధి చెందుతోంది. నేను ఆరోగ్యంగా ఉండటానికి అండగా నిలిచిన వారే కారణం`` అంటూ చాలానే చెప్పింది. నేను పాజిటివిటీని అనుసరిస్తున్నానని అమలా పాల్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో చెప్పుకొచ్చింది. నొప్పి కలిగాకే పాఠాలే నేర్చుకోవడం తగదని కూడా అమలాపాల్ సెలవిచ్చింది. దర్శకుడు ఎఎల్ విజయ్ తో విఫలమైన వివాహం గురించి ఆమె ప్రస్తావిస్తోందా? లేదా ఆమెను రోజువారీ సంఘటనలు నొప్పిస్తున్నాయా? అందుకే ఎదుటివారికి పాఠాలు నేర్పేంతగా ఆధ్యాత్మికంగా ఎదిగిందా? అన్నదానికి సరైన ఆన్సర్ ఇంకా రాలేదు తననుంచి. అన్నీ బాగానే ఉన్నా కానీ.. ``మీ భాగస్వామి మీ ఆధ్యాత్మిక గురువు`` అని చెప్పడం ద్వారా పెద్ద షాకిచ్చింది. ఈ వ్యాఖ్యను పరిశీలిస్తే .. అది తన ప్రియుడు భవీందర్ సింగ్ గురించేనా? అన్న సందేహం కలగక మానదు.
కరోనావైరస్ వ్యాప్తి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ అయిన క్రమంలో అమలా పాల్ తన స్వస్థలమైన కేరళలోనే ఉండిపోయింది. ఆమె తన కుటుంబంతో సమయాన్ని గడుపుతోంది. పుస్తకాలు చదవడం .. అందులోనే ఆనందాన్ని వెతుక్కోవడం.. విశ్రాంతి తీసుకోవడం వ్యాపకాలుగా మారాయి. ఇటీవల `ఓషో - ది బుక్ ఆఫ్ మ్యాన్` పుస్తకం చదివిందట. ఆ పుస్తకం ప్రభావం పాల్ పై అంతా ఇంతా కాదని ఆ తర్వాతనే తెలిసొచ్చింది. స్త్రీలు- ప్రేమ గురించి.. వివాహం గురించి.. పిల్లల గురించి.. పెయిన్ గురించి ఫుల్ గా క్లాస్ తీస్కుంది ఆ పుస్తకం చదివాకే. స్త్రీ బానిసత్వం .. అవమానం గురించి ప్రశ్నిస్తూ పురుషాధిక్యంపై దుమ్మెత్తిపోసింది. జీవితంలో యోగా- ధ్యానం- భక్తి ప్రాధాన్యత.. నిరాశనిస్ప్రహలపై పోరాటంపైనా అమలాపాల్ పూర్తి స్పష్ఠతతో ఉందని తాజ సన్నివేశం క్లియర్ కట్ గా చెబుతోంది.