సౌత్ తో పాటు ఉత్తరాదిలోనూ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్ 2' చిత్రంతో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన 'కేజీఎఫ్ 2' దేశ వ్యాప్తాంగా సంచలనాలు సృష్టించింది. కనీ వినీ ఎరుగని రీతిలో వసూళ్ల వర్షం కురిపించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలు, కన్నడ ఇండస్ట్రీలోనే కాకుండా ఉత్తరాదిలోనూ భారీ ప్రభావాన్ని చూపించింది. ఉత్తరాదిలో వసూళ్ల పరంగా 'కేజీఎఫ్ 2'రికార్డులు సృష్టించి సరికొత్త చర్చకు తెరలేపిన విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత 'చాప్టర్ 3'ని కూడా వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకరాబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో నిర్మాత విజయ్ కిరగందూర్ పలు మీడియాలకు ప్రత్యేకంగా ఇస్తున్న ఇంటర్వ్యూల్లో వెల్లడిస్తున్న విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం 'సలార్' మూవీ చేస్తున్నారు. ప్రభాస్ హీరో గా నటిస్తున్న ఈమూవీ చిత్రీకరణ దశలో వుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ తరువాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31 ని పట్టాలెక్కిస్తాడా? లేక ఎన్టీఆర్ 31 ని పక్కన పెట్టి 'కేజీఎఫ్ 3'కి వెళ్లిపోతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అయితే ఈ నేపథ్యంలో పలు మీడియాలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్న 'కేజీఎఫ్' నిర్మాత విజయ్ కిరగందూర్ తాజా వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం 'సలార్' మూవీని తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్ 3' ఇప్పట్లో సెట్స్ పైకి తీసుకొచ్చే అవకాశం లేదని, దీనికి మరి కొంత సమయం పడుతుందని స్పష్టం చేశారట.
'సలార్'ని పూరక్తి చేసిన వెంటనే ప్రశాంత్ నీల్ 'ఎన్టీఆర్ 31'ని సెట్స్ పైకి తీసుకెళతారని క్లారిటీ ఇచ్చేశారు. ఇటీవల ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ 31 కు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన బేసిక్ థీమ్ పై చిత్ర బృందం వర్క్ చేస్తోందట. అలాగే ప్రశాంత్ నీత్ స్టోరీ డిపార్ట్ మెంట్ కూడా పలు రకాల ఐడియాలని డెవలప్ చేసే పనిలో వున్నారని, ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయి ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ ని రెడీ చేయబోతున్నారని, 'సలార్' షూటింగ్ పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ దీనిపై వర్క్ చేయడం మొదలు పెడతారని, 'సలార్' రిలీజ్ కు ముంవదే ఈ మూవీని పట్టాలెక్కిస్తామని నిర్మాత విజయ్ కిరగందూర్ వెల్లడించినట్టుగా తెలిసింది.
అంటే ఎన్టీఆర్ 31 పై కేజీఎఫ్ మేకర్స్ ఫుల్ క్లారిటీతో వున్నారన్నమాట. ఇదిలా వుంటే 'సలార్' లాక్ డౌన్ కారణంగా డిలే అవుతూ వస్తోంది. గ్రాఫిక్స్ పరంగానూ ఈ మూవీ డిలే అయితే ప్రశాంత్ నీల్ మాత్రం ఈ మూవీ కోసం కూర్చోకుండా ఎన్టీఆర్ మూవీని పట్టాలెక్కించాలనే పూర్తి స్పష్టతతో వున్నారట. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి.