అరుంధ‌తి పేరు పాడు చేస్తారా?

Update: 2019-06-22 04:51 GMT
ఆర్.ఎక్స్ 100 బ్యూటీ పాయ‌ల్ రాజ్ పుత్ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. వేడెక్కించే రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ల‌కు పాయ‌ల్ అదిరిపోయే ఛాయిస్ అన‌డంలో సందేహమే లేదు. అయితే ఇప్పుడు పాయ‌ల్ ఏకంగా అరుంధ‌తి పాత్ర‌లో న‌టించేస్తోంది. ఇది అరుంధ‌తి సీక్వెల్ అంటూ ప్ర‌చారం ఊద‌రగొట్టేస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే..

అరుంధ‌తి 2 పేరుతో పాయ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఇందులో పాయ‌ల్  అరుంధ‌తిలా క‌త్తి దూస్తుంది. రాణి రుద్ర‌మ‌లా గుర్ర‌పు స్వారీ చేస్తుంది. అన్నిట్లోనూ అవ‌స‌రం మేర శిక్ష‌ణ తీసుకుంటోంద‌ని ప్ర‌క‌టించారు. విజువ‌ల్ గ్రాఫిక్స్ ప్రాధాన్య‌త‌తో రూపొందించే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్లో రూపొందిస్తామ‌ని నిర్మాత కోటి తూముల తెలిపారు. అయితే మారిన ట్రెండ్ లో ప్ర‌తి ఒక్క‌రూ పాన్ ఇండియా సినిమాలు తీయాల‌ని అనుకోవ‌డం చాలా కామ‌న్ గా మారింది. పైగా పాపుల‌ర్ సినిమాల టైటిల్స్ పెట్టుకుని ఇలాంటి ప్ర‌య‌త్నం చేయ‌డం చూస్తుంటే .. వీళ్ల ప్ర‌య‌త్నాన్ని ప్రోత్స‌హించ‌వ‌చ్చు.

కానీ అంద‌రూ శ్యాంప్ర‌సాద్ రెడ్డి కాలేరు క‌దా? అన్న సందేహాలు అరుంధ‌తి అభిమానుల‌కు ఉన్నాయి. ఆయ‌న తెర‌కెక్కించిన అరుంధ‌తి తెలుగు సినిమా హిస్ట‌రీలో ఓ మాస్ట‌ర్ పీస్ అన్న సంగ‌తిని మ‌ర్చిపోకూడదు. ఆ సినిమా కోసం ఆయ‌న ఆర్థిక క‌ష్టాల గురించి అప్ప‌ట్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. అలాగే అరుంధ‌తి పాత్ర‌లో అనుష్క న‌ట‌నాభిన‌యం సినిమాకే హైలైట్. జేజ‌మ్మ‌గా అనుష్క‌ను త‌ప్ప వేరొక‌రిని ఊహించుకోలేరు జ‌నం. అయితే ఇప్పుడు అరుంధ‌తి 2లో రెండు సినిమాల కిడ్ పాయ‌ల్ న‌టిస్తోందని.. పాన్ ఇండియా లెవ‌ల్ అని ప్ర‌చారం ఊద‌ర‌గొట్టేయ‌డం చూస్తుంటే పెద్ద స్కెచ్చే వేశార‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తే క‌థ యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ తో ఉండాలి. ప్రొడ‌క్ష‌న్ విలువ‌లు అంతుకుమించి ఉండాలి. నాశిర‌కంగా సినిమాని చుట్టేస్తే అభిమానుల నుంచే చీవాట్లు తినాల్సి ఉంటుంది. ప్ర‌క‌ట‌న ఘ‌నం.. ప‌ని శూన్యం.. అయితే అటుపై నిర్మాత‌ల‌కు చీవాట్లు త‌ప్ప‌వ‌నే చెప్పాలి. శ్యాం ప్ర‌సాద్ రెడ్డి అంత‌గా రిస్క్ చేసి భారీ పెట్టుబ‌డుల‌తో.. ఎంతో ఎఫ‌ర్ట్ పెట్టే సీనుందా? ఉంటే అది నిరూపించాల్సి ఉంటుంద‌ని అభిమానులు కోరుతున్నారు.



Tags:    

Similar News