పుష్ప హిందీ సెన్సార్ ఆల‌స్యమ‌వుతోందా?

Update: 2021-12-16 05:32 GMT
అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా మూవీ.. హిందీ డెబ్యూ మూవీగా పుష్ప పాపుల‌రైంది. అయితే ఈ సినిమా హిందీ విడుదల డైల‌మా కొన‌సాగుతోంది. ఈ చిత్రానికి హిందీ వెర్షన్ సెన్సార్ సర్టిఫికెట్ ఇంకా రాలేద‌ని తెలిసింది. పూర్తి ప్రింట్ ని సెన్సార్ బోర్డుకి పంపలేకపోయారట‌ మేకర్స్. అసంపూర్తి చిత్రాన్ని చూడటానికి బోర్డు నిరాకరించింది. ఇప్పుడు టీమ్ ఇప్పుడు ఫైనల్ ప్రింట్ ను పంపింది. అయితే రేపటిలోగా దీనికి క్లియరెన్స్ రావాల్సి ఉంది.

ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సాంకేతిక బృందం సోమవారం వరకు ఈ చిత్రానికి కరెక్షన్స్ చేసే పనిలో ఉన్నారు. తుది సౌండ్ మిక్సింగ్ లేనప్పటికీ తెలుగు స‌హా ఇత‌ర‌ దక్షిణ భారత భాషల వెర్షన్ లకు సెన్సార్ ప‌రంగా క్లియరెన్స్ వ‌చ్చేసింది.

అలాగే హిందీ వెర్ష‌న్ కి వేరే చిక్కులు ఉన్నాయి. మల్టీప్లెక్స్‌లు హాలీవుడ్ బిగ్గీ స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో హిందీ వెర్షన్ కు ముంబై- ఢిల్లీ ఇతర పెద్ద నగరాల్లో ఎక్కువ స్క్రీన్ లు రావడం లేదని తెలుస్తోంది.

ఈ సినిమా హిందీ వెర్షన్ కి మొదటి నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి. యూట్యూబ్ లో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో హక్కులను కొనుగోలు చేసినందున హిందీ పంపిణీదారు మొదట థియేటర్లలో విడుదల చేయడానికి నిరాకరించాడు. అయితే నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించి డిస్ట్రిబ్యూటర్ ని ఒప్పించారు అల్లు అర్జున్. అలాగే హిందీలో ప్ర‌చారం చేయ‌డంలో టీమ్ త‌డ‌బ‌డింది.

టిక్కెట్టు పాత రేటుతో పుష్ప‌కు ప్ల‌స్

పుష్ప‌ డిసెంబ‌ర్ 17న తెలుగు-త‌మిళం-క‌న్న‌డ‌-మ‌ల‌యాళం భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇంటా బ‌య‌టా పుష్ప రికార్డులు బ్రేక్ చేయ‌డం ఖాయ‌మ‌న్న టాక్ వినిపిస్తోంది.

ఇప్ప‌టికే ట్రైల‌ర్ పాట‌లు జ‌నంలోకి దూసుకెళ్లాయి. వీటితో అమాంతం అంచ‌నాలు రెట్టింప‌య్యాయి. ఇక ఇంటా బ‌య‌టా పుష్ప‌-ది రైజ్ భారీ ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన సంగ‌తి తెలిసిందే. అందుకు త‌గ్గ‌ట్టే భారీ వ‌సూళ్ల ల‌క్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీగా థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్నారు.

ఇంకా రిలీజ్ కి ముందే అమెరికాలో ఏకంగా 2ల‌క్ష‌ల డాల‌ర్లు పైగా ప్రీబుకింగ్స్ రూపంలో పుష్ప - 1 క‌లెక్ట్ చేసింది. ఇదే విష‌యాన్ని పోస్ట‌ర్ వేసి మ‌రీ వెల్ల‌డించింది చిత్ర‌బృందం.

అమెరికా నుంచి 3 మిలియ‌న్ల వ‌సూళ్ల‌ను పుష్ప కొల్ల‌గొడుతుంద‌ని టీమ్ ఆశిస్తోంది. హంసిని ఎంట‌ర్ టైన్ మెంట్స్ -క్లాసిక్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా అమెరికాలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాయి. అమెరికాలో స్థానిక బ‌య్య‌ర్ల‌తో వ్యాపార‌ప‌ర‌మైన డీల్స్ కుదురుతున్నాయ‌ని తెలిసింది.

అఖండ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు పుష్ప విజ‌యంపైనా ధీమా పెరిగింది. భ‌య‌పెడుతున్న‌ ఒమిక్రాన్ ప్ర‌భావం తెలుగు రాష్ట్రాలకు అంత‌గా లేదు. ఇటీవ‌ల టిక్కెట్టు పాత రేట్ల‌ను కొన‌సాగిస్తూ కోర్టు తీర్పు వెలువ‌డ‌డం పుష్ప‌కు పెద్ద ప్ల‌స్ కానుంది.

పుష్ప చిత్రం తొలి మూడు రోజుల్లో 100కోట్లు.. అటుపై వారంలో 200-300 కోట్లు సునాయాసంగా వ‌సూలు చేస్తుంద‌ని అభిమాన‌ వ‌ర్గం విశ్లేషిస్తోంది. 500 కోట్ల వ‌సూళ్ల ల‌క్ష్యంగా ఈ చిత్రాన్ని సుకుమార్ - మైత్రి వ‌ర్గాలు విడుద‌ల చేస్తున్నాయన్న గుస‌గుస వినిపిస్తోంది.

Tags:    

Similar News