అమెజాన్ తో ఒక సోష‌ల్ మీడియా యుద్ధం జ‌రుగుతోందా?

Update: 2022-05-17 06:22 GMT
అమెజాన్ ప్రైమ్ వీడియోతో వీవ‌ర్స్ నెట్టింట పెద్ద యుద్ధ‌మే ప్ర‌క‌టించిన‌ట్టుగా క‌నిపిస్తోంది. తాజాగా ఆమెజాన్ ప్రైమ్ ప్ర‌క‌టించిన పే ప‌ర్ వ్యూ విధానం వీవ‌ర్స్ లో తీవ్ర ఆగ్ర‌హాన్ని, అస‌హానాన్ని క‌లిగిస్తోంది. దీంతో ఓటీటీ ప్రియులు నెట్టింట అమెజాన్ పై ట్విట్ట‌ర్ వార్ ప్ర‌క‌టించిన తీవ్ర స్థాయిలో ట్రోల్ చేయ‌డం మొదలు పెట్టారు. వివ‌రాల్లోకి వెళితే.. క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం 'కేజీఎఫ్ 2'. ప్ర‌శాంత్ నీల్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది.

వ‌సూళ్ల ప‌రంగా క్రేజీ చిత్రాల‌ని సైతం వెన‌క్కి నెట్టి వాటి రికార్డుల్ని తుడిచిపెడుతూ ప్ర‌భంజ‌నాన్ని సృష్టిస్తోంది. చాప్ట‌ర్ 1ని మించి చాప్ట‌ర్ 2 వుండ‌టంతో 'కేజీఎఫ్ 2' కు దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. సినిమాపై కాసుల వ‌ర్షం కురిపిస్తున్నారు. దీంతో కేజీఎఫ్ 2 ఊహించిన దానికి మించి బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల మోత మోగిస్తోంది. సినిమా విడుద‌లై నెల రోజులు దాటినా ఇప్ప‌టికీ వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌లైన అన్ని థియేట‌ర్ల‌లోనూ అదే హ‌వాను కొన‌సాగిస్తూ సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది.

ఇదిలా వుంటే ఈ మూవీ క్రేజ్ త‌గ్గ‌క ముందే క్యాష్ చేసుకోవాల‌ని మాస్ట‌ర్ ప్లాన్ చేసింది ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం అమెజాన్ ప్రైమ్‌. ఈ చిత్రాన్ని ఐదు భాష‌ల్లో స్ట్రీమింగ్ హ‌క్కుల్ని అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ మొత్తాన్ని రాబ‌ట్ట‌డం కోసం కొత్త ప్లాన్ ని అమ‌ల్లోకి తీసుకొచ్చింది. పే ప‌ర్ వ్యూ విధానాన్ని 'కేజీఎఫ్ 2'లో ప్ర‌వేశ పెట్టి వినియోగదారుల‌కు గ‌ట్టి షాకిచ్చింది. వ‌న్ ఇయ‌ర్ స‌బ్స్ స్క్రిప్ష‌న్ రూ. 1499 పే చేసినా స‌రే 'కేజీఎఫ్ 2'ని వీక్షించాలంటే రూ. 199 అదనంగా చెల్లించాల్సిందే అంటూ కొత్త నిబంధ‌న‌ని అమ‌ల్లోకి తీసుకొచ్చింది.

దీనిపై ఓటీటీ ప్రియులు మండిప‌డుతున్నారు. వ‌న్ ఇయ‌ర్ స‌బ్స్ స్క్రిప్ష‌న్ రూ. 1499 పే చేసినా అద‌నంగా రూ. 199 ఎందుకు చెల్లించాలంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అమెజాన్ ప్రైమ్ కు నెటిజ‌న్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా దిమ్మ‌దిరిగే షాకులివ్వ‌డం ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది. పే ప‌ర్ వ్యూ విధానంలో కాకుండా సినిమాని వివిధ ప్లాట్ ఫామ్ ల‌లో డౌన్ లోడ్ హె చ్‌ డీ ప్రింట్ లింక్స్ ల‌భిస్తుండ‌టంతో ఇల్లీగ‌ల్ గా ఈ మూవీని డౌన్ లోడ్ చేసుకుంటూ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియా అకౌంట్ కు లింగ్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు.

అంత‌టితో ఆగ‌క చాలా మంది హె చ్‌ డీ ప్రింట్ స్క్రీన్ షాట్స్ ని కూడా షేర్ చేస్తూ నెట్టింట అమెజాన్ పై యుద్ధాన్ని ప్ర‌క‌టించ‌డం విశేషం. దీంతో ఇల్లీగ‌ల్ డౌన్ లోడ్స్ ని ఎలా ఆపాలో తెలియ‌క అమెజాన్ వ‌ర్గాలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయ‌ట‌. చ‌డీ చ‌ప్పుడు లేకుండా అమెజాన్ 'కేజీఎఫ్ 2' స్ట్రీమింగ్ ని స్టార్ట్ చేసి బ‌ల‌వంతంగా వినియోగ‌దారుల‌ నుంచి పే ప‌ర్ వ్యూ విధానం ద్వారా అద‌నంగా డ‌బ్బులు దండుకోవాల‌న్న ప్లాన్ దారుణంగా ఫ్లాప్ అయింది.

యుఎస్ లాంటి న‌గ‌రాల్లో ఇష్టం మేర‌కే పే ప‌ర్ వ్యూ అనే ఆప్ష‌న్ ని ఇస్తున్నా మ‌న ఇండాయాలో మాత్రం త‌ప్ప‌ని స‌రి చేయ‌డం నెటిజ‌న్ ల ఆగ్ర‌హానికి గురి కావాల్సి వ‌స్తోంది. తాజా ఉదంతం కార‌ణంగా అమెజాన్ భారీ స్థాయిలోనే న‌ష్ట‌పోయే అవ‌కాశాలు వున్నాయ‌ని, పే ప‌ర్ వ్యూ ని ప‌క్క‌న పెట్టి ఓటీటీ ల‌వ‌ర్స్ సినిమాని ఇల్లీగ‌ల్ గా డౌన్ లోడ్ చేసుకుంటుండ‌టం అమెజాన్ కు భారీ దెబ్బ‌గా మారింద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News