మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిరు నుంచి సినిమా దాదాపు రెండేళ్లవుతోంది. ఈ నేపథ్యంలో 'ఆచార్య' కోసం ప్రేక్షకుల, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలో సందడి చేస్తుందా అని ఆసక్తిని చూపిస్తున్నారు. అంతే కాకుండా ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక అతిథి పాత్రలో నటించడంతో 'ఆచార్య'పై అంచనాలు మరింత పెరిగాయి.
గత రెండేళ్లుగా పరిస్థితులు అనుకూలించకపోవడంతో సినిమాలన్నీ రిలీజ్ లు వాయిదా పడ్డాయి. చాలా సినిమాలు రిలీజ్ సమస్యని ఎదుర్కొన్నాయి. ఇదే కోవలో 'ఆచార్య' కూడా రిలీజ్ సమస్యని ఎదుర్కొంది. ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా రిలీజ్ దగ్గరపడిన నేపథ్యంలో చిత్ర బృందం వరుస ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా వున్నారు. ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తూ చరణ్, చిరు సినిమాపై అంచనాల్నిపెంచేస్తున్నారు.
ఇందులో చరణ్ పాత్ర నిడివి 45 నిమిషాలని క్లారిటీ వచ్చేసింది. అంటే దాదాపు గంట అన్నమాట అంటే సినిమాలో సగ భాగం మొత్తం చరణ్ పైనే కీలక ఘట్టం అంతా నడుస్తుందని స్పష్టమవుతోంది. పాదఘట్టంలోని ధర్మస్థలి నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. చరణ్ పాత్ర ఏంటీ? .. చిరు పాత్రతో ఎలా కలుస్తుంది? .. ఇద్దరు కలిసి నక్సలైట్ లు గా ఎందుకు మారారు? .. ఆ తరువాత చరణ్ పాత్రని ఎండ్ చేశారా?.. చేస్తే ఎలా ఎండ్ అయింది? అనే ప్రశ్నలు ఇప్పడు ఫ్యాన్స్ ని వేధిస్తున్నాయి.
ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం తాజాగా బయటికి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని ఇంటర్వెల్ సీక్వెన్స్ సినిమాకు బిగ్గెస్ట్ హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది.
ట్రైలర్ లో చూపించిన సీన్ ఇంటర్వెల్ బ్యాంగ్ అని తెలుస్తోంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ లో చిరు చేయిపై లేచి చరణ్ ప్రత్యర్థులపై చిరుతపులిలా స్వైర విహారం చేసే సీన్ అబ్బురపరిచింది. అదే సీన్ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అని తెలుస్తోంది.
థియేటర్లలో ఈ సీన్ ప్రేక్షకులకు రోమాంచిత అనుభూతిని కలిగించి ఫ్యాన్స్ విజిల్స్ తో థియేటర్స్ దద్దరిల్లేలా చేస్తుందని చెబుతున్నారు. ఈ హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ అని చెబుతున్నారు. అంతే కాకుండా చిరు, చరణ్ లపై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని ఇన్ సైడ్ టాక్. ఇందులో చరణ్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. కీలక పాత్రల్లో నాజర్, సంగీత, సోనుసూద్ నటించారు.