ఆగస్టు 1 నుంచి షూటింగ్ ల బంద్ అంటూ గిల్డ్ ప్రొడ్యూసర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై చాలా మంది ప్రొడ్యూసర్స్ బాహాటంగానే కౌంటర్లు వేశారు. గిల్డ్ నిర్ణయంపై మండిపడ్డారు. వారే బిగ్ స్టార్స్ తో సినిమాలు చేస్తూ పారితోషికాలు పెంచేస్తూ.. బడ్జెట్ లు పెంచేస్తూ ఇప్పడు నిర్మాణ వ్యయం పెరిగిపోయిందని, వేస్టేజ్ ఖర్చులు పెరుగుతున్నాయని షూటింగ్ ల బంద్ కు పిలుపునివ్వడం ఏంటని మండిపడుతున్నారు. వున్నట్టుండి ఇండస్ట్రీ గిల్డ్ షూటింగ్ ల బంద్ తో రెండుగా చీలిపోయింది అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
దీనికి ప్రధాన కారణంగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ ని ముందుకు తీసుకొచ్చిన దిల్ రాజు. ఆయన కారణంగానే ఇప్పడు ఇండస్ట్రీలో తీవ్ర గందరగోళం మొదలైంది. షూటింగ్ లు నిలిపివేయాలంటే ప్రకటించిన దిల్ రాజు ఆయనే తన సినిమా షూటింగ్ ని యధేశ్చగా జరుపుతుండటం తాజా వివాదానికి ప్రధాన కేంద్ర బిందువుగా నిలుస్తోంది.
దిల్ రాజు తమిళ స్టార్ హీరో విజయ్ తో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి, తెలుగు టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న ఈ మూవీని తెలుగులో `వారసుడు`గా తమిళంలో `వారీసు`గా విడుదల చేయబోతున్నారు.
అన్ని సినిమాల షూటింగ్ లని నిలిపి వేయాలని చెప్పిన దిల్ రాజు మాత్రం ఈ మూవీ షూటింగ్ కంటిన్యూ చేస్తున్నాడు. అదేమంటే ఇది తమిళ సినిమా అని చెబుతుండటం, ఇదే తరహాలో గిల్డ్ సభ్యులు సూర్యదేవర నాగవంశీ తమిళ హీరో ధనుష్ తో నిర్మిస్తున్న `సార్` మూవీ షూటింగ్ ని కూడా ఆపకపోవడంతో ప్రస్తుతం కొంత మంది నిర్మాతలు సోమవారం నుంచి తమ సినిమాల షూటింగ్ లని యధావిధిగా ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చారట.
ఇక నేచురల్ స్టార్ నాని కూడా తను నటిస్తున్న `దసరా` మూవీ షూటింగ్ కు సంబంధించిన తాజా షెడ్యూల్ ని సోమవారం నుంచి ప్రారంభించబోతున్నారట. గిల్డ్ నిర్ణయం మేరకు షూటింగ్ ని నిలిపివేయాలని గిల్డ్ సభ్యులు ఇటీవల నానిని కోరినా తన నిర్మాతకు ఇబ్బందులు కలిగించడం తనకు ఇష్టం లేదని షూటింగ్ ని ఆపనని నిర్మొహమాటంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే రవితేజ `రావణాసుర` షూటింగ్ ని మాత్రం అన్నపూర్ణలో నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. గిల్డ్ సభ్యుల కారణంగానే ఈ మూవీ నిర్మాత అభిషేక్ నామా నిలిపి వేసినట్టుగా చెబుతున్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో టాలీవుడ్ గిల్డ్ బంద్ కారణంగా రెండుగా చీలినట్టుగా స్పష్టమవుతోంది. మరి సోమవారం సెట్స్ పైకి వెళ్లనున్న `దసరా`ని దిల్ రాజు అండ్ కో సభ్యుల అడ్డుకుంటారా?.. అలా చేస్తే నేచురల్ స్టార్ నాని, `దసరా` నిర్మాత సుధాకర్ చెరుకూరి ఊరుకుంటారా? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.