`నాన్ బెయిల‌బుల్ వారెంట్` ఆధారాలేవీ? కోర్టుకు శంక‌ర్!!

Update: 2021-02-20 09:45 GMT
ద‌ర్శ‌కుడు శంక‌ర్ కి ఓ కేసులో నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ అయ్యింద‌ని ఇంత‌కుముందు ప్ర‌చార‌మైంది. అయితే ఆ త‌ర్వాత దానికి ఎలాంటి ఆధారాలు లేవ‌ని త‌ప్పుడు ప్ర‌చార‌మ‌ని శంక‌ర్ వివ‌ర‌ణ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అంతే కాదు.. దీనిపై కోర్టుకు కూడా వెళ్లారు.

తాజాగా ఆయ‌న కోర్టు ఆవ‌ర‌ణ‌లో క‌నిపించిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. శుక్రవారం ఈ కేసు విచారణకు రాగా.. స‌రైన ఆధారాలు ల‌భించ‌క‌.. తదుప‌రి తేదీకి వాయిదా పడింది. ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలను సేకరించడం కోసం జ‌డ్జీలు ఈ వాయిదా వేశారు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు శంకర్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందనే ఇటీవ‌ల త‌ప్పుడు ప్ర‌చారం సాగ‌గా దానిని సరిచేస్తూ శంక‌ర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్ లైన్ రిపోర్టింగ్ లో లోపం కారణంగా ఇది జరిగిందని తెలిపారు.

జుగిబా అనే చిట్టి(చిన్న‌) క‌థ‌ను కాపీ చేసి ఎంథీరన్ (రోబో) అనే బ్లాక్ బ‌స్ట‌ర్ ని శంక‌ర్ తెర‌కెక్కించార‌ని రచయిత అరుర్ తమిళనందన్ ఆరోపించగా.. కాపీ రైట్స్ కేసుపై కోర్టులో విచార‌ణ సాగుతోంది. 2019లో మ‌ద్రాసు హైకోర్టులో ఇది విచార‌ణ‌కు వ‌చ్చింది. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ శంకర్ అప్పీల్ చేయ‌డంతో కాపీరైట్ ఉల్లంఘన కేసు చాలా మలుపులు తీసుకుంది. సుప్రీంకోర్టులోనూ విచార‌ణ సాగింది. ఇప్ప‌టికీ ఈ కేసు శంక‌ర్ ని ఇలా వెంటాడుతూనే ఉంది. ఎన్ని కేసులు ఉన్నా.. ఐ... 2.0 వంటి భారీ సినిమాల్ని తెర‌కెక్కించి ప్ర‌స్తుతం భార‌తీయుడు 2 తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News