మ‌హేష్ హీరోయిన్ మూవీని ప‌ట్టించుకునేవారే లేరా?

Update: 2022-05-06 05:33 GMT
థిచేట‌ర్ల‌లో, ఓటీటీల్లో విడుద‌ల‌య్యే ప్ర‌తీ సినిమాకు ఇప్ప‌డు ప‌బ్లిసిటీ త‌ప్ప‌న‌స‌రి. అది స‌రిగా లేక‌పోతే సినిమా ఎప్పుడు వ‌చ్చింది.. ఎప్పుడు వెళ్లిందో కూడా ఎవ‌రికి తెలియ‌డం లేదు. దీంతో చాలా మంది మేక‌ర్స్ సినిమా నిర్మాణంతో పాటు ప‌బ్లిసిటీని కూడా ప్ర‌త్యేకంగా చూస్తున్నారు. భారీగా ఖ‌ర్చు చేస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన 'ట్రిపుల్ ఆర్ ' ప్ర‌మోష‌న్స్ కోసం 20 కోట్ల‌కు మించి ఖ‌ర్చు చేశారంటే పబ్లిసిటీకి ఎంత ప్రార‌ధాన్య‌త ఇస్తున్నారో స్ప‌ష్ట‌మ‌వుతోంది.

థియేట‌ర్ రిలీజ్ అయినా.. ఓటీటీ రిలీజ్ అయినా ప్ర‌మోష‌న్స్ మ‌స్ట్ గా చేస్తున్నారు. కానీ ఓ సినిమా కు మాత్రం ఇవ‌న్నీ ప‌ట్ట‌న‌ట్టే వుంది. స్టార్ హీరోయిన్ న‌టించిన త‌మిళ చిత్రం 'సాని కాయిధ‌మ్‌'. ఇదే చిత్రాన్ని తెలుగులో 'చిన్ని' పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

క్రేజీ ద‌ర్శ‌కుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ఈ చిత్రంలో కీర్తి సురేష్ కు స‌హాయ‌కుడిగా న‌టించాడు. త‌న కుటుంబాన్ని పోగొట్టుకున్న ఓ యువ‌తి ఓ వ్య‌క్తి స‌హాయంతో 25 మందిని దారుణంగా హ‌త్య చేసి త‌న ప్ర‌తీకారం తీర్చుకుంటుంది. ఇదే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

కీర్తి సురేష్ తొలిసారి డీగ్లామ‌రైజ్డ్ పాత్ర‌లో క‌నిపించ‌గా సెల్వ‌రాఘ‌వ‌న్ కూడా అదే త‌ర‌హా పాత్ర‌లో న‌టించారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో మే 6న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయ‌బోతున్నారు.

అయితే ఈ చిత్రాన్ని ఎలాంటి హ‌డావిడి లేకుండా అమెజాన్ సంస్థ స్ట్రీమింగ్ చేస్తోంది. గ‌తంలో త‌మ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న చిత్రాల‌కు భారీ స్థాయిలో హంగామా చేసే ఈ ఓటీటీ దిగ్గ‌జ వ‌ర్గాలు కీర్తి సురేష్ సినిమాని మాత్రం సైలెంట్ గా స్ట్రీమింగ్ చేస్తుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. దీంతో సినిమా రిలీజ్ అన్న విష‌య‌మే చాలా మందికి తెలియ‌డం లేదు.

కీర్తి సురేష్‌ 'మ‌హాన‌టి' త‌రువాత నుంచి బ్యాక్ టు బ్యాక్ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తూ వ‌స్తోంది. అయితే అవేవీ బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్ కాలేక‌పోయాయి. పెంగ్విన్‌, మిస్ ఇండియా, గుడ్ ల‌క్ స‌ఖి వంటి చిత్రాలు భారీ ఫ్లాపులుగా నిలిచాయి. గ‌త చిత్రాల ఫ‌లితాల‌ను దృష్టిలో పెట్టుకునే అమెజాన్ ప్రైమ్ కీర్తి సినిమాని సైలెంట్ గా రిలీజ్ చేస్తోంద‌ట‌. ప‌గా ప్ర‌తీకారాల నేప‌థ్యంలో ప‌క్కా వాస్త‌విక‌త ఉట్టిప‌డేలా తెర‌కెక్కిన ఈ సినిమా కీర్తి అభిమానుల్ని ఈ సారైనా మెప్పిస్తుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News