ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఎక్కడి విన్నా ఒకటే మాట `పుష్ప`.. పుష్ప`.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. బన్నీ - సుక్కుల కాంబినేషన్ లో ముచ్చటగా మూడవసారి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీకి క్రేజ్ ఏర్పడింది. దీంతో సినిమాకు వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ లభించాయి.
ఫస్ట్ పార్ట్ కి మంచి టాక్ రావడంతో బన్నీ - సుక్కు పార్ట్ 2ని పూర్తి చేసే పనిలో నిమగ్నం కాబోతున్నారు. కొంత విరామం తరువాత ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ని స్పీడప్ చేసి పార్ట్ 2ని కంప్లీట్ చేయబోతున్నారట.
ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత అల్లు అర్జున్ .. మాసీవ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ భారీ చిత్రాన్ని చేయబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ వినిపిస్తోంది.
బోయపాటి శ్రీను రీసెంట్గా నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కించిన `అఖండ` చిత్రంతో తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాలకృష్ణ చిత్రాల్లో సరికొత్త కార్డులు సృష్టిస్తూ బాక్సీఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబడుతోంది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్ లో వునన్న బోయపాటి శ్రీను తన తదుపరి చిత్రం కోసం భారీ స్కెచ్ ని సిద్ధం చేసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ తో అత్యంత భారీ స్థాయిలో చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టిన బోయపాటి ఈ చిత్రాన్ని భారత స్వాతంత్య్రం నేపథ్యంలో సాగే ఓ వీరుడి కథగా అత్యంత శక్తివంతంగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలనుకుంటున్నారట.
బన్నీ `పుష్ప -2` ని పూర్తి చేసిన వెంటనే ఈ పిరియాడిక్ స్టోరీని పట్టాలెక్కించాలనే ఆలోచనలో వున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ తారాగణంతో భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించనున్నారని తెలిసింది.
ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాల్ని చిత్ర బృందం వచ్చే ఏడాది ప్రకటించే అవకాశం వుందని తెలిసింది. బన్నీ - బోయపాటి ల కలయికలో ఇంతకు ముందు `సరైనోడు` వంటి హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందిన విషయం తెలిసిందే.