థియేట‌ర్ల భ‌విత‌వ్యం తేల్చేవి ఆ చిత్రాలే!

Update: 2022-08-03 03:30 GMT
థియేట‌ర్ల‌కి ప్రేక్ష‌కుల‌కు రాని స‌న్నివేశంతో టాలీవుడ్ లో గుబులు మొద‌లైందా?  టిక్కెట్ ధ‌ర‌లు త‌గ్గించినా అదే స‌న్నివేశం రిపీట్ అవ్వ‌డంతో ఆ సీన్ మ‌రింత ముదురుతొందా? అంటే అవున‌నే వినిపిస్తుంది. థియేట‌ర్ కి ప్రేక్ష‌కుడు రాక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఓటీటీకి అల‌వాటుప‌డిపోవ‌డమ‌న్న‌ది ప్ర‌ధానంగా క‌నిపిస్తున్న స‌మ‌స్య‌.

టిక్కెట్ ధ‌ర‌లు త‌గ్గించినా అదే స‌న్నివేశం క‌నిపిస్తుంది కాబ‌ట్టి ఇక్క‌డ  ధ‌ర క‌న్నా ఓటీటీ ప్ర‌భావమే స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. దీన్ని బ‌ట్టి అర్ధమ‌వుతోంది ఏంటి? అంటే కంటెంట్ లో ఖ‌లేజా  ఉండాలి. ఇలాంటి సినిమా ని థియేట‌ర్లో మిస్ అయ్యామే! అన్న ఫీలింగ్ అడియ‌న్ కి తీసుకురాగ‌ల‌గాలి. అప్పుడే మ‌ళ్లీ జ‌నాలు థియేట‌ర్ వైపు చేస్తారు అన్న‌ది వాస్త‌వంగా క‌నిపిస్తుంది.

`కేజీఎఫ్`..`ఆర్ ఆర్ ఆర్` ..`మేజ‌ర్ `లాంటి సినిమాలు ఆద‌ర‌ణ‌కు నోచుకున్నాయంటే కార‌ణం వాటిలో మ్యాట‌ర్ ఉంది కాబ‌ట్టే. దీన్ని బ‌ట్టి అప్ క‌మింగ్ సినిమాల విష‌యంలో...భవిష్య‌త్ ప‌రంగా కంటెంట్ విష‌యంలో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇంకెన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి? ఎంత ప‌క‌డ్భందీగా వ్య‌వ‌హ‌రించాలి అన్న‌ది అద్దం ప‌డుతుంది.

నిర్మాత  దిల్ రాజు ఇటీవ‌లే ఇదే విష‌యాన్ని విశ్లేషించారు. నిర్మాత‌లంతా స‌మావేశ‌మే దీనిపై సుదీర్ఘంగా  చ‌ర్చించారు. సినిమాలు తీయ‌డం అంటే గ‌తంలో లా డ‌బ్బులిచ్చేయ‌డం కాదు...కంటెంట్ ఉన్న క‌థ‌ల్ని ఎంపిక చేసుకున్న‌ప్పుడే జ‌నాలు మ‌ళ్లీ థియేట‌ర్ కి వ‌స్తార‌ని రాజుగారు విశ్లేష‌ణ‌లో తేలింది. మెజార్టీ వ‌ర్గం ఆయ‌న విశ్లేష‌ణ‌ని స‌మ‌ర్ధించారు.

థియేట‌ర్ ప‌రంగా ఇప్పుడున్న స‌మ‌స్య‌ని అధిగ‌మించాలంటే తూచ త‌ప్ప‌కుండా ప్ర‌తీ నిర్మాత ఇక‌పై ఎంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌రించాల్సిందే.  ఈ వారం  కొన్ని సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. వాటిలో క‌ళ్యాణ్ రామ్ న‌టించిన `బింబిసార` రిలీజ్ అవుతుంది. భారీ కాన్సాస్ పై చిత్రాన్ని తెర‌కెక్కించారు. విజువ‌ల్ గా సినిమాలో చాలా అంశాలే క‌నిపిస్తున్నాయి.

అలాగే హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `సీతారామం` రిలీజ్ అవుతుంది. క్రియేటివ్  మేక‌ర్ గా హ‌ను కి మంచి పేరుంది. యూత్ టార్గెట్ గా రిలీజ్ అవుతుంది.  ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రెండు సినిమాలు థియేట‌ర్ల భ‌విత‌వ్యాన్ని తేల్చే చిత్రాలగా శుక్ర‌వారం థియేట‌ర్లోకి వ‌స్తున్నాయి.

రిలీజ్ అనంత‌రం  రెండు సినిమాల‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తో పాటు...మెయిన్ స్ర్టీమ్ మీడియాలో పాజిటివ్ రివ్యూలు రావాలి. యావ‌రేజ్..య‌బౌయావ‌రేజ్..హిట్ అనే టాక్ కాకుండా సూప‌ర్ అనే టాక్ రావాలి.  ప్రేక్ష‌కుల నోళ్ల‌లో ఆ సినిమాలు న‌ల‌గాలి.  ఆ టాక్ తోనే  జనాలు  థియేట‌ర్ కి వెళ్లాలి. అలా జ‌రిగితేనే థియేట‌ర్ భ‌వితవ్యానికి వ‌చ్చిన ప్ర‌మాదం లేద‌ని చెప్పొచ్చు.

ఒక‌వేళ అంతా పాజిటివ్ గా ఉన్నా..జ‌నాలు థియేట‌ర్ కి వెళ్ల‌లేదు అంటే థియేట‌ర్ల భవిష్య‌త్ దేవుడు చేతుల్లోనే ఉన్న‌ట్లు. అప్పుడు ఓటీటీ విష‌యంలో మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌రించాల్సి ఉంటుంది. ప‌దివారాల కండీష‌న్ న్ ని 20 వారాల‌కు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
Tags:    

Similar News