గీతా ఆర్ట్స్ ఆఫీస్ పై ఐటీ దాడులు!

Update: 2019-03-08 12:16 GMT
స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు సంబంధించిన గీతా ఆర్ట్స్ ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారాని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.  నిన్న రాత్రి ఈ ఐటీ ఈ దాడులు జరిగాయని సమాచారం.   ఈ దాడులకు సంబంధించిన విషయం బైటకు పొక్కిన వెంటనే టాలీవుడ్ లో ఇతర ప్రొడ్యూసర్లు.. డిస్ట్రిబ్యూటర్లు జాగ్రత్తపడ్డారట.

ఈ దాడుల గురించి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా ఐటీ శాఖ వారు చేపట్టే వ్యవహారమని అంటున్నారు.  2018-19 ఆర్ధిక సంవత్సరానికి గానూ గీతా ఆర్ట్స్ వారికి 'గీత గోవిందం'.. 'టాక్సీవాలా' రూపంలో రెండు సూపర్ హిట్స్  వచ్చాయి.  ఆ నేపథ్యంలోనే ఆ సినిమాల కలెక్షన్స్ లెక్కలు సరిగా ఉన్నాయా లేదా చూసేందుకు ఈ దాడులు జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.  

అయితే ఈ దాడులకు సంబంధించి అధికారికంగా మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అటు ఆదాయపు పన్ను శాఖ అధికారులు కానీ ఇటు గీతా ఆర్ట్స్ వర్గాలు కానీ ఈ దాడుల విషయంపై ఇంతవరకూ స్పందించలేదు.  
 
Tags:    

Similar News