హీరో నుంచి కేరక్టర్ ఆర్టిస్ట్ గాను.. ఇప్పుడు విలన్ గాను కెరీర్ టర్నింగ్ ఇచ్చుకున్నాడు జగపతి బాబు. ఇప్పుడు జగపతి చేస్తున్న సినిమాల లిస్ట్ చేస్తే ఆశ్చర్యం వేయక మానదు. తెలుగు.. తమిళ్ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో జేబీ భాగం అయిపోయాడు. అంతే కాదు.. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న భక్తిరస చిత్రంలో కూడా జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు ఈపాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
సప్తగిరుల ప్రాంతాన్ని పరిపాలించిన రాజుగా 'ఓనం నమో వెంకటేశాయ' చిత్రంలో కనిపించనున్నాడు జగపతి బాబు. ఎరుపు.. బంగారు వర్ణాలతో కూడిన వస్త్రధారణ.. అలంకరణలో.. జగపతి ఫస్ట్ లుక్ అదుర్స్ అనిపించేలా ఉంది. ఇప్పటివరకూ తన కెరీర్ లో జగపతి ఇలాంటి కేరక్టర్ చేయకపోవడంతో.. కొత్తదనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో జగ్గూభాయ్ కి జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ప్రగ్యాతో రొమాంటిక్ సీన్స్.. సాంగ్ కూడా జగపతికి ఉంటాయట.
గతంలో అన్నమయ్య చిత్రంలో మోహన్ బాబు పోషించిన పాత్రకు.. 'ఓం నమో వెంకటేశాయ' చిత్రంలో జగపతిబాబు చేసిన రోల్ కు దగ్గరి పోలికలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే.. ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న జగపతి.. ఈ కొత్త గెటప్ లో మాత్రం అదరగొట్టేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన టీజర్ లో జగపతిని చూపించారు కానీ.. ఆ లుక్ ఈ లుక్ వేరువేరులే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/