రవితేజతో జగపతిబాబు వార్
లెజెండ్ సినిమాలో విలన్ గా నటించి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాక జగపతిబాబు మళ్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తరవాత చాలా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలెన్నో వేశాడు. జగపతిబాబు హీరోగా నటించిన సినిమాల్లో కంటే విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాకే ఎక్కువ డిఫరెంట్ పాత్రలు చేశాడు. కేవలం తెలుగులోనే కాకుండా మళయాళం.. తమిళంలో విలన్ పాత్రలు చేసి మెప్పించాడు.
ఈమధ్య తెలుగు సినిమాల్లో మళ్లీ సాఫ్ట్ పాత్రల్లోనే జగపతిబాబు ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఇలాంటి టైంలో మళ్లీ పవర్ ఫుల్ విలన్ పాత్ర జగపతిబాబును వెతుక్కుంటూ వచ్చింది. సోగ్గాడే చిన్నినాయనా ఫేం కురసాల కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసే సినిమాలో విలన్ పాత్రకు జగపతిబాబును తీసుకొనే ప్రయత్నాల్లో సినిమా యూనిట్ ఉంది. ‘‘ఈ మూవీలో విలన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. రవితేజతో నువ్వా నేనా అన్నట్టుగా ఈ క్యారెక్టర్ ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయంలో వీళ్లిద్దరూ సమ ఉజ్జీల్లా ఉంటారు. అందుకోసమే జగపతిబాబును సంప్రదించాం. దాదాపుగా ఈ పాత్రను ఆయన ఓకేచేసే అవకాశం ఉంది.’’ అని యూనిట్ లోని ఓ సభ్యుడు తెలిపారు.
డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఫస్ట్ సినిమా సోగ్గాడే చిన్నినాయన తరహాలో రవితేజ సినిమా కూడా మొత్తం రూరల్ బ్యాక్ డ్రాప్ లోనే నడుస్తుందని తెలుస్తోంది. రవితేజ ప్రస్తుతం టచ్ చేసి చూడు సినిమా షూటింగ్ లో బీజీగా ఉన్నాడు. ఈ సినిమా పనులు పూర్తయ్యాక కళ్యాణ్ కృష్ణ సినిమా షూటింగ్ పై దృష్టి పెట్టనున్నాడు. రవితేజ పూర్తిస్థాయి హీరోగా టర్న్ కాకముందు క్యారెక్టర్ రోల్స్ చేశాడు. అప్పటికి జగపతిబాబు మంచి ఫాంలో ఉన్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఎస్.వి.కృష్ణారెడ్డి డైరెక్షన్ బడ్జెట్ పద్మనాభం సినిమా రిలీజైంది. ఈసారి రవితేజ హీరోగా నటిస్తుంటే జగపతిబాబు అందులో రోల్ చేస్తున్నాడు. కాలం చిత్రమైనది కదా.