జూ.ఎన్టీఆర్ ఏకంగా మూడు విలక్షణ రోల్స్ ను పోషిస్తున్న సినిమా 'జై లవ కుశ'. ఈ సినిమాలో మనోడు ఇప్పటికే రావణాసురిడి అంశను పోలి ఉన్న విలన్ క్యారక్టర్ తో బాగానే ఆకట్టుకున్నాడు. ఆ తరువాత వచ్చిన క్యారక్టర్లతో కూడా బాగానే ఆకట్టుకుంటాడని అర్దమవుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేటును సెప్టెంబర్ 21 అని ఫిక్స్ చేసేశారు కాని.. ఆడియో లాంచ్ ఎప్పుడు??
ఇప్పటికే జై లవకుశ టీజర్ కు దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందనే టాక్ ఉంది. అయితే ఈ సినిమాకు కూడా మంచి స్వరాలు అందించాడని చాలామంది చెబుతున్నారు. గతంలో నా అల్లుడు నుండి నాన్నకు ప్రేమతో వరకు దేవి ఎప్పుడూ ఎన్టీఆర్ కు బెస్ట్ ఆల్బమ్స్ ఇచ్చాడు. ఇంతకీ ఈ ఆడియోను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే.. నిజానికి నందమూరి హరికృష్ణ బర్తడే సందర్బంగా ఈ సినిమా ఆడియో లాంచ్ ను సెప్టెంబర్ 2న రిలీజ్ చేయాల్సి ఉంది. కాని ఎన్టీఆర్ కు ఆరోజు బిగ్ బాస్ కార్యక్రమం ఉండడం వలన.. ఆయన బర్తడే తరువాత రోజైన సెప్టెంబర్ 3న రిలీజ్ చేస్తున్నారట.
ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ కు సంబంధించిన చాలా ఈవెంట్లకు ఆయన తండ్రి హరికృష్ణ.. అన్నయ్య కళ్యాణ్ రామ్ లే చీఫ్ గెస్టులు. కాని ఈ సినిమాను స్వయంగా కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి.. ఇప్పుడు రాజమౌళిని చీఫ్ గెస్టుగా పిలుస్తున్నారని టాక్ వినిపిస్తోంది.ఇక ఆడియో లాంచ్ కార్యక్రమం నుండి సినిమా ప్రమోషన్లను మొదలెడితే.. 21న రిలీజ్ అయ్యేవరకు దద్దరిల్తిస్తారట. అది సంగతి.