ఎనభై ఆరు దాటిస్తేనే..లవకుశ హిట్

Update: 2017-09-10 04:48 GMT
తెలుగులో చాలా రోజుల తర్వాత మారో భారీ చిత్రం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అయ్యింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మాతగా కె.ఎస్ రవీంద్ర దర్శకత్వంలో "జై లవకుశ" చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రలతో కనిపిస్తున్నాడు. దీంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు అలుముకున్నాయి. ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ కెరీర్ లోనే  అత్యధిక థియేటర్స్ లో జై లవకుశ రిలీజ్ అవ్వనుంది.

అసలు మ్యాటర్ లోకి వెళితే ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో బిజినెస్ చేసింది. మొత్తం తెలుగు వరల్డ్ వైడ్ థ్రియేటికల్ రైట్స్ తో ఈ సినిమా 86 కోట్ల బిజినెస్ చేసింది. ముఖ్యంగా నైజాం ఏరియాల్లో అత్యధికంగా 21.2 కోట్ల రూపాయల ధర పలకగా అతి నెల్లూరు వంటి ప్రాంతంలో 2.9 కోట్ల రూపాయలు పలికింది. ఇక సీడెడ్ లో 12.6 కోట్లతో శభాష్ అనిపించుకుంది. అంతే కాకుండా ఈస్ట్ - వెస్ట్ ఏరియాల్లో కలిపి 10 కోట్లకు పైగా అమ్ముడిపోయి సినిమాకి అంచనాల్ని పెంచింది. అంతకంటే ఎక్కువ స్థాయిలో గుంటూరు-కృష్ణ ఏరియాల్లో 12 కోట్లను అందుకుంది. ఇక ఎన్టీఆర్ సినిమాలకి కర్ణాటక లో మంచి మార్కెట్ ఉండడంతో అక్కడ మనోడి సినిమా మునుపెన్నడూ లేని విధంగా 8 కోట్ల తో అమ్ముడుపోయింది. జనతా గ్యారేజ్ ఊపుతో ఎన్టీఆర్ ఓవర్సీస్ లో కూడా 8.5 కోట్ల రూపాయల థ్రియేటికల్ రైట్స్ ను అందుకున్నాడు. మొత్తంగా 86 కోట్ల బిజినెస్ చెయ్యగలడా ఎన్టీఆర్ అనేది ఆసక్తిగా మారింది.

మరి ఆ సంఖ్యను దాటితేనే జై లవకుశ హిట్ చిత్రంగా నిలుస్తుంది. అందుకే ఏ మాత్రం ఆలోచించకుండా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. మొదటి వారంలోనే ఈ సినిమా ఆ మొత్తాన్ని అందుకొవాలి.. ఎందుకంటే ఆ మరుసటి వారమే స్పైడర్ రాబోతోంది. ఒకవేళ సినిమా అనుకున్న విధంగా మెప్పిస్తే అన్నేసి కోట్లు క్రాస్ కావడం పెద్ద ఇబ్బందేమి కాదేమో కాని.. తేడా పడితే మాత్రం.. సీన్ సితార్ అయిపోతుంది!!


Tags:    

Similar News