జేమ్స్ బాండ్ 007 యాక్షన్ థ్రిల్స్ ని మిస్సయ్యి అప్పుడే చాలా ఏళ్లు అవుతోంది. బాండ్ సిరీస్ లో కొత్త మూవీ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజీ సిరీస్ లో 25 వ చిత్రం `నో టైమ్ టు డై` విడుదల ఆలస్యమవుతుందని తాజాగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కోసం ప్రేక్షకులు 2021 ఏప్రిల్ 2 వరకు వేచి చూడాల్సి ఉంటుందని తెలిపారు.
నో టైమ్ టు డై వాయిదా ఇదే మొదటి సారి. కాదు ఇంతకుముందు తేదీ ప్రకటించి వాయిదా వేశారు. ఇప్పుడు మరోసారి ఆలస్యం అవుతోందని ప్రకటించడం నిరాశపరిచింది. ఈ చిత్రంలో డేనియల్ క్రెయిగ్ కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎంజీఎం యూనివర్సల్ - ఎంజిఎం బ్యానర్లపై మైఖేల్ జి విల్సన్ - బార్బరా బ్రోకలీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రతిదీ ప్రణాళిక ప్రకారమే చేస్తున్నాం. ప్రజారోగ్య సంక్షోభం కారణంగా.. ఏప్రిల్ 2020 విడుదల నుండి తేదీని వెనక్కి నెట్టాల్సి వచ్చింది. ఈ సీక్వెల్ నవంబర్ నుంచి పెండింగ్ చిత్రీకరణ పూర్తి చేస్తున్నాం అని తెలిపారు నిర్మాతలు.
ఆలస్యం అభిమానులకు నిరాశ కలిగించిందని మేం అర్థం చేసుకున్నాము. కాని ఇప్పుడు వచ్చే ఏడాది రిస్క్ లేని సమయం ఎంచుకుంటున్నాం అని మేకర్స్ తెలిపారు. నిన్న బిల్లీ ఎలిష్ పాడిన `జేమ్ బాండ్ థీమ్ సాంగ్` విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లు మార్చిలో మూసివేసాక.. న్యూయార్క్ నగరంలో ఇప్పటికీ థియేటర్లు తెరవలేదు. ఎప్పుడు తెరుస్తారో కూడా తెలీదు. లాస్ ఏంజిల్స్‌లోని సినిమా థియేటర్లు మూతపడ్డాయి మరికొన్ని వారాల్లో తెరవడానికి అనుమతి పొందవచ్చు. ఇంగ్లాండ్ లోని థియేటర్లు కూడా చాలా కష్టంగా ఉన్నాయి. ఇక్కడే బాండ్ సినిమాలు సాధారణంగా మంచి వసూళ్లు సాధిస్తుంటాయి. వీటన్నిటినీ మించి ఉత్తర అమెరికాలో చాలావరకు ప్రజారోగ్య సంక్షోభం కొనసాగుతోంది. సినిమా లకు ఇది చెడ్డ వార్త అన్న ఆందోళనా నెలకొంది.