అదో క్రేజ్. అదొక పిచ్చి. అంతేలేదు. అలుపేలేదు. 1962లో మొదలైన ఈ సినిమాల పర్వం.. ఇంకా నడుస్తూనే ఉంది. ఎన్ని సంవత్సరాలైనా కూడా నడిపిస్తూనే ఉంటాం అని సెలవిచ్చారు కూడా. అతడే జేమ్స్ బాండ్. అవి బ్రిటీష్ గుఢచారి చేసే విన్యాశాల సినిమాలు. ఇయాన్ ఫ్లెమింగ్ అనే రచయిత క్రియేట్ చేసిన ఈ క్యారెక్టర్ తో ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేస్తున్నారనుకోండి.
ఇక ప్రస్తుతం బాండ్ క్యారెక్టర్ నటుడు డేనియల్ క్రెయిగ్ ఇప్పుడు 'స్పెక్టర్' అనే కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. అక్టోబర్ 26న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న ఈ సినిమా తాలూకు ట్రైలర్ నిన్ననే విడుదలైంది. ఏదో తెలియన ఒక సంక్షిప్త మెసేజ్ ను చేధిస్తూ మెక్సికో నుండి రోమ్ నగరం వస్తాడు బాండ్. తీరా శత్రువును వెతుక్కుంటూ వెళ్లేసరికి.. ఆ శత్రువులు నడిపే స్పెక్టర్ అనే ఓ యసాసిన్ (మృత్యు హంతకులు) గ్రూప్ లో బాండ్ కూడా ఒక మెంబరే అని తెలుస్తుంది. అదే షాక్. ట్విస్ట్. అద్యంతం చేజ్ లు, ఫైట్లు, ట్విస్టులు, ఎత్తుకు పై ఎత్తులు, రొమాన్స్, మోసం, కుట్రలతో సాగే ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఇండియాలో కూడా అందరికీ తెగ నచ్చేసింది.
ఇకపోతే ఇప్పటివరకు వచ్చిన 23 బాండ్ సినిమాల్లో మొన్న వచ్చిన 'స్కై ఫాల్' సినిమా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసింది. ఇప్పుడు 'స్పెక్టర్' సినిమాను చూస్తుంటే అంతకంటే ఎక్కువగా వసూలు చేస్తుందని అనిపిస్తోంది. బాండ్ ఈజ్ బ్యాక్!!!