టాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ `జనగణమన` ని `JGM` పేరుతో రీసెంట్ గా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈమూవీ పవర్ ఫుల్ మిలటరీ ఆఫీసర్ కథగా తెరపైకి రాబోతోంది. ఏప్రిల్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించబోతున్నారు. ఇటీవల ముంబైలో లాంఛనంగా మొదలైంది.ఏప్రిల్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా వున్న వివిధ దేశాల్లో ఈ మూవీ కీలక ఘట్టాల చిత్రీకరణ జరపబోతున్నారు.
ఇదిలా వుంటే ఇదే పేరుతో మలయాళంలో ఓ మూవీ రూపొందుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మమతా మోహన్ దాస్, శ్రీదివ్య హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రాన్ని డిజో జోస్ అంటోని తెరకెక్కించారు. దేశ భక్తి ప్రధానంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
తాజాగా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ని గురువారం రిలీజ్ చేశారు. విడుదలైన గంటల్లోనే ట్రైలర్ దాదాపు 4 మిలియన్ వ్యూస్ ని రాబట్టి సంచలనం సృష్టిస్తోంది. నిజాయితీ లోపించిన వ్యవస్థపై ఓ నామాన్యుడు సాగించే సమరంగా ఈ సినిమా కథ సాగనున్నట్టుగా తెలుస్తోంది. న్యాయం కోసం ప్రశ్నించే క్రమంలో సర్వస్వం కోల్పోయి చేతి కర్ర సహాయంతో మాత్రమే నడవగల దివ్యాంగుడిలా మారిన వ్యక్తిగా ఇందులో పృథ్వీరాజ్ నటించాడు.
పోలీసుల చిత్రహింసల కారణంగా తను నడవలేకపోతున్నానని, తనకు న్యాయం చేయండని, కనీసం వైద్యం చేయించుకోవడానికి కనీసం డబ్బులైనా ఇప్పించండని అర్జీ పేపరుతో ఓ వ్యక్తిని కలుస్తాడు. అప్పుడే భోజనం చేస్తున్న సదరు వ్యక్తి ఆ పేపరుని పరిశీలించి ఇది చాలా చిన్న విషయం.. దీన్ని నేను పరిష్కరిస్తాను.. అయితే నేను ఒక విషయం చెబుతాను అది వార్నింగ్ అనుకోకు.. ప్రస్తుతం నువ్వు చేస్తున్న వన్నీ మానేయ్. ఇప్పుడు ఏం జరిగిందో చూశావా? .. నీ కుటుంబం... నీ కెరీయర్ ని నువ్వే స్వయంగా నాశనం చేసుకున్నావు.
మంచిది.. నీతి, నిజాయితీ, న్యాయం.. ఇవన్నీ కొంత మంది ఇడియట్ లు మాట్లాడుకునే మాటలు. వ్యక్తిగతంగా నువ్వు సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు ఏ ఒక్కడు కూడా ని వెంట నిలబడరు. నువ్వే చెప్పు ఉన్నారా నీ వెంట ఎవరైనా? .. నీ తరుపున ప్రశ్నించే వారు. మీడియా వుందా? .. కోర్టులున్నాయా? .. పోనీ పబ్లిక్ వున్నారా నీ వెంట?.. కారణం ఏంటో నీకు మాత్రమే తెలుసు. అని వెటకారంగా వెకిలిగా నవ్వుతూ పృథ్విరాజ్ ని ప్రశ్నిస్తాడు. దీంతో తెలుసు సార్ అని అచేతనంగా లేచి చేతి కర్ర సాయంతో అతని ముందు నుంచి బయటికి వెళ్లిపోతాడు...
బయటికి ఎంట్రీ ఇచ్చిన మరుక్షణమే రూమ్ మొత్తం పేలిపోయిన తీరు ఆకట్టుకుంటోంది. సినిమా సంథింగ్ అనే స్థాయిలో ట్రైలర్ వుండటంతో దీనిపై బారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో పృథ్విరాజ్ సుకుమారన్ - సూరజ్ ల కలయికలో `డ్రైవింగ్ లైసెన్స్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ వచ్చింది. మళ్లీ అదే కాంబినేషన్ `జన గణ మన` కు రిపీట్ కావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీని వలర్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.
Full View