ఫోటో స్టోరీ: తెల్ల చీరలో లక్ష వోల్టుల తార!

Update: 2020-04-30 01:30 GMT
అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు అనే టాగ్ ఒక్కటి చాలు.. అటు ఇండస్ట్రీ.. ఇటు ప్రేక్షకుల దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించేందుకు. జాన్వి కపూర్ విషయంలో అదే జరిగింది. ఇప్పటి వరకూ జాన్వి నటించిన సినిమా ఒక్కటే రిలీజ్ అయింది కానీ ఓ పది సినిమాలు చేస్తే కానీ రాని క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ భామ ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రెస్ అన్నట్టుగా ఉంటుంది. ఇక జాన్వి జిమ్ము డ్రెస్సులైతే ప్రపంచం దృష్టినే ఆకర్షిస్తుంటాయి.

అలా అని ఎప్పుడూ మోడరన్ గానే ఉంటుందని అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. ఒక్కోసారి చీరకట్టి జనాలకు నిద్రను దూరం చేస్తుంటుంది. ఈమధ్య జాన్వి జిమ్ముకు పోవడం లేదు.. దీంతో జనాలు ఆ జిమ్ము డ్రెస్సులను మిస్ అవుతున్నారు. ఇక సంప్రదాయ చీరకట్టును కూడా కొంతమంది అభిమానులు మిస్సవుతున్నారు. అలాంటి నెటిజెన్లు టైమ్ మెషీన్ లో కరోనా లేని కాలానికి ప్రయాణించి మరీ.. ఆ ఫోటోలను వెలికి తీస్తున్నారు అని చెప్తే ఎవ్వరూ నమ్మరు కదా. అందుకే నిజమే చెప్పుకుందాం.. వారందరూ అంతర్జాలంలో శోధించి ఆ ఫోటోలను వెలికి తీస్తున్నారు.

పైన మీరు చూస్తున్న ఫోటోఅలాంటిదే. తెల్ల చీర వయ్యారంగా కట్టుకుని అంతకంటే వయ్యారంగా నడుచుకుంటూ పోతుంటే ఎవరి గుండె చప్పుడైనా మామూలుగా కంటే కనీసం నాలుగైదు మిల్లీ సెకన్లు ఆలస్యంగా కొట్టుకుంటుంది. అయితే ఈసీజీ మిషనును ఎవరూ వీపుకు తగిలించుకుని తిరగరు కాబట్టి ఈ విషయం తెలియదు. జూనియర్ అతిలోక సుందరి కాబట్టి ఆమాత్రం హాట్ నెస్ ఉండాల్సిందే. ఇక జాన్వి సినిమాల విషయానికి వస్తే 'గుంజన్ సక్సేనా'.. 'రూహ్ అఫ్జా'.. 'దోస్తానా 2' చిత్రాల్లో నటిస్తోంది.
Tags:    

Similar News