అమ్మ అనగానే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గుర్తుకు వస్తుందన్న విషయం తెలిసిందే. అలాంటిది ఈ వయసులో అమ్మ డ్యాన్స్ షో అన్న సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. ఇప్పుడు మేం చెబుతున్నది పాత ముచ్చట. ‘‘అమ్మ’’ ఇమేజ్ రాక ముందు జయలలిత లైఫ్ లో జరిగిన ఈ ఘటన ఆమెలోని మరో కోణాన్ని చూపిస్తుంది. ప్రజల కోసం తపన పడే ఆమె తత్వం ఆకర్షించటమే కాదు.. జీవితంలో అత్యున్నత స్థానానికి ఆమె ఎలా ఎదిగిందన్న విషయాన్ని తెలియజేస్తుందని చెప్పొచ్చు.
ఈ విషయాన్ని ఇక్కడ కట్ చేస్తే.. మూడు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేస్తూ.. తమిళనాడుకు వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా అమ్మ బాధ్యతలు స్వీకరించిన వైనం తెలిసిందే. అయితే.. ఎన్నికల్లో ఆమె విజయం సాధించాలని కర్ణాటకకు చెందిన ఓ చిన్న ఊరి వాళ్లు ఎంతగానో కోరుకున్నారు. అమ్మ విజయం సాధించగానే వారు పండగ చేసుకున్నంత పని చేశారు. నీటి వివాదం విషయంలో తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అలాంటిది జయలలిత ముఖ్యమంత్రి అవుతున్నారన్న విషయానికి కర్ణాటకలోని ఓ గ్రామంలోని వారు అంతగా సంతోషపడటానికి సముచితమైన కారణం లేకపోలేదు. కాకుంటే.. ఈ విషయం బాగా అర్థం కావాలంటే దాదాపు 50 ఏళ్ల వెనక్కి వెళ్లాలి.
తమిళనాడు రాష్ట్రానికి ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జయలలిత పుట్టింది మాత్రం కర్ణాటకలోని మైసూర్ లో. సహజసిద్ధంగా ఆమె కన్నడవాసి. కాకుంటే.. 1960 ప్రాంతంలో ఆమె ఆంటీ జయలలితను మద్రాస్ కు తీసుకురావటం.. సినిమాల్లో నటించటంతో ఆమె ఈ రోజు ఈ స్థానంలో ఉన్నారు. ఇక.. తాజాగా ఆమె సీఎం కావటాన్ని పండగలా చేసుకున్న నాగువినహళ్లి గ్రామస్తుల ఉదంతంలోకి వెళితే.. ఈ గ్రామం మాండ్యా జిల్లాలో ఉంది.
యాభై ఏళ్ల క్రితం ఈ గ్రామంలో స్కూల్ లేదు. అప్పట్లో జయలలిత హీరోయిన్ గా మంచి పేరు ఉంది. ఈ గ్రామానికి చెందిన వారు జయలలిత వద్దకు వెళ్లి.. ఆమెను స్కూల్ విషయం చెప్పి.. సాయం చేయాలని కోరారు. స్కూల్ కోసం ఆమె ఒక డ్యాన్స్ షో చేసేందుకు సిద్ధమయ్యారు. 1967లో మైసూర్ యూనివర్సిటీలో ఈ ప్రత్యేక నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ షోకు టికెట్ ధరలుగా రూ.10.. రూ.25.. రూ.50 నిర్ణయించారు. అప్పటికే హీరోయిన్ గా ఆమెకు మంచి పేరు ఉండటం.. స్కూల్ కోసం స్పెషల్ డ్యాన్స్ షో అనటంతో జనాలు భారీగా హాజరయ్యారు. అనుకున్నట్లే షో సక్సెస్ కావటం.. ఆ షోతో వచ్చిన నిధులతో ఆ ఊరిలో స్కూల్ కట్టించారు. అప్పుడెప్పుడో 50 ఏళ్ల క్రితం తమ ఊళ్లో స్కూల్ కోసం జయలలిత స్పెషల్ డ్యాన్స్ షో వేయటాన్ని ఇప్పటికి ఆ ఊరి ప్రజలు మర్చిపోకపోవటమే కాదు.. ఆమె ఎన్నికల్లో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఒక చిన్న ఊళ్లో స్కూల్ కోసం అప్పుడెప్పుడో 50 ఏళ్ల క్రితం స్పెషల్ డ్యాన్స్ షో చేయటం నిజంగా గ్రేట్ కదూ..?