హైదరాబాద్ లోని సూత్రధార్ యాక్టింగ్ స్కూల్ కు చెందిన వినయ్ వర్మ తాజాగా నటన నేర్చుకోవాలంటే డ్రస్ విప్పాలంటూ ఒత్తిడి చేశాడంటూ అంచిత కౌర్ మీడియా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. వినయ్ వర్మపై పోలీసులకు కూడా అంచిత ఫిర్యాదు చేసింది. యాక్టింగ్ క్లాస్ లో అబ్బాయిలు ఉండగా ఇద్దరం అమ్మాయిలం ఉన్నాము. డ్రస్ విప్పాలంటూ ఆయన చెప్పగా నేను ఒప్పుకోలేదు. నా పక్కన ఉన్న అమ్మాయి మాత్రం అతడు ఒత్తిడి చేయడంతో డ్రస్ విప్పింది. నేను మాత్రం బయటకు వచ్చేశాను. డ్రస్ విప్పకుంటే రేపటి నుండి క్లాస్ కు కూడా రావద్దని హెచ్చరించాడు అంటూ అంచిత చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.
అంచిత విషయమై సినీ పరిశ్రమపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇండస్ట్రీలో అయినా, యాక్టింగ్ నేర్చుకునే వద్ద అయినా డ్రస్ విప్పితేనే పని అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీ గురించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో తాజాగా జీవిత రాజశేఖర్ ఈ విషయమై స్పందించింది. మా ప్రధాన కార్యదర్శిగా ఉన్న జీవిత బాధితురాలు అయిన అంచితతో మాట్లాడటం జరిగిందట. అసలు విషయం ఏంటీ అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసిందట.
ఈ సందర్బంగా జీవిత మాట్లాడుతూ.. అంచితను నేను అన్ని విషయాలు అడిగాను. నిన్ను శారీరకంగా ఇబ్బంది పెట్టాడా, ఇంకా లైంగికంగా వేదించాడా అని అడిగి తెలుసుకున్నాను. అలాంటిది ఏమీ లేదని చెప్పింది. 28 రోజుల యాక్టింగ్ కోర్కు కోసం 25 వేల రూపాయలు కట్టి జాయిన్ అయ్యాను అంది. జాయిన్ అయిన సమయంలో డ్రస్ ల గురించి ఎలాంటి ప్రస్థావన రాలేదట. అయితే మొన్న క్లాస్ లో మాత్రం డ్రస్ విప్పకుంటే రేపటి నుండి క్లాస్ కు రావద్దంటూ బ్లాక్ మెయిల్ చేసినట్లుగా ఆయన మాట్లాడాడట. అంచితకు ఇండస్ట్రీ అండగా ఉంటుంది.
సినిమా ఇండస్ట్రీలో నా ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇద్దరు కూడా యాక్టింగ్ లో ఉన్నారు. ఇండస్ట్రీలో ఉన్న ఆడపిల్లలకు సెక్యూరిటీ కావాలని నేను కూడా కోరుకుంటాను. అయితే చిన్న విషయం జరిగినా కూడా ఇండ్రస్టీ మొత్తం అలాగే అని, డ్రస్ విప్పితే కాని పని అవ్వదు అంటూ విమర్శలు చేయడం ఏమాత్రం సమంజసం కాదంటూ జీవిత చెప్పుకొచ్చింది.
30 ఏళ్లుగా సినీ కెరీర్ లో ఉన్న వినయ్ వర్మ గురించి ఇలాంటి వార్తలు రావడం చర్చనీయాంశం అవుతుంది. డ్రస్ విప్పమన్న మాట వాస్తవమే, ఇష్టం లేకుంటే వెళ్లి పోమన్నాను, ఆమెను కనీసం టచ్ కూడా చేయలేదు అంటూ ఆయన తన వర్షన్ వినిపిస్తున్నాడు.