హీరో రాజశేఖర్ కి కోవిడ్ 19 చికిత్స జరుగుతున్న సంగతి తెలిసిందే. వెంటిలేటర్ సాయంతో వైద్యానికి రాజశేఖర్ బెటర్ గా స్పందిస్తున్నారని కుటుంబీకులు ఇప్పటికే తెలిపారు. ఆయన కుమార్తె శివాత్మిక మీడియా గాసిప్స్ ని ఖండిస్తూ నాన్నగారి ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.
ఇంతకుముందు ఆస్పత్రి వైద్య వర్గాలు సైతం రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ఐసీయు చికిత్స కొనసాగుతోంది. వైద్యానికి రాజశేఖర్ చక్కగా స్పందిస్తున్నారని త్వరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే ఈలోగానే రాజశేఖర్ అనారోగ్యంపై మీడియాలో రకరకాల వదంతులు ప్రచారం అయిపోయాయి. వీటిని ఖండిస్తూ తాజాగా రాజశేఖర్ సతీమణి జీవిత స్పందించారు. ఈ వదంతుల్ని నమ్మవద్దని రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని జీవిత వెల్లడించారు. ఆయనపై సాగుతున్న తప్పుడు ప్రచారం బాధకు గురి చేస్తోందని అన్నారు.