మనిషిలోని వికృతం ఏ స్థాయిలో ఉంటుందో అనేది కొన్నేళ్ళ కిందట ఒక డాన్సర్ పై తీసిన సినిమాగా 'బ్లాక్ స్వాన్' నిరూపించింది. డారెన్ అరనాఫస్కీ డైరెక్ట్ చేసిన బ్లాక్ స్వాన్ సినిమా అప్పటిలో థ్రిల్లర్ సినిమాలులలో వచ్చిన ఒక అద్భుత సినిమాగా పేరుక్కొన్నారు. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ నటాలి పోర్ట్ మ్యాన్ ను ఆస్కార్ అవార్డ్ వరించింది. ఇప్పుడు అదే డైరెక్టర్ తీస్తున్న ఒక సైకో థ్రిల్లర్ లవ్ స్టోరీ రాబోతుంది. జెనీఫర్ లారెన్స్ నటిస్తున్న ఈ ''మదర్'' అనే థ్రిల్లర్ టీజర్ చూస్తే భయంతో మనం శ్వాస కూడా తీసుకోవడం మరిచిపోతాం.
హారర్ సినిమాలు అంటే ముఖ్యంగా ఉండవలిసింది స్టార్ కాస్ట్ కాదు. ఎందుకంటే హారర్ సినిమాను నడిపించేది స్టార్ కాదు సౌండ్. ఆ సౌండ్ తో కథ నడిపించడం తెలిస్తే ఇంకా ఆ సినిమాలో నటీనటులు గురించి అడిగే అవసరం కూడా రాదు ప్రేక్షకులకు. ఈ సినిమా టీజర్ లో కూడా భయపెట్టే దృశ్యాలు ఏమి కనిపించవు కానీ భయపెట్టే శబ్ధాలు మాత్రం వినిపిస్తాయి భయపెడతాయి. టీజర్ జెనీఫర్ కోణంలో మొదలువుతుంది. ఒక వాయిస్ ఓవర్ లో ఇక్కడకు నివ్వు ఎందుకు వచ్చావు? అని అడుగుతుంది. దానికి జెనీఫర్ నాకు ఇక్కడ ఉండటానికి ఒక ఇల్లు దొరికింది అని చెబుతుంది. జేవియర్ బార్డెమ్ ఈ వాయిస్ ఓవర్ లో మాట్లాడాడు. అలా వాయిస్ పూర్తి కావడం తోనే కొన్ని భయానక దృశ్యాలు స్పీడ్ గా ప్లే అవుతూ గాడ్ సేవ్ యు అని ముగిస్తుంది.
సినిమా టీజర్ మాత్రం ఇప్పటి వరకు వచ్చిన హారర్ సినిమాలు కన్నా సౌండర్ పరంగా అద్భుతంగా ఉంది అనే చెప్పవచ్చు. ఈ సినిమా టీజర్ లో క్రూరంగా చంపే హత్యలు కూడా కనిపిస్తున్నాయి. టూకీగా ఈ సినిమా కథ ఏంటంటే ఒక ఇద్దరు భార్య భర్తలు కలిసి ఉంటున్న ఒక ఇంటిలో ఊహించని ఒక అతిది వస్తాడు. అలా వచ్చిన తరువాత ఆ ఇంటిలో శాంతి అనేది పూర్తిగా లేకుండా పరిస్థితులు తారుమారు అవుతాయి. ఈ హారర్ సినిమా సెప్టెంబర్ 15 నాడు థియేటర్లులలో విడుదలకాబోతుంది. ఆగస్టు 8న ట్రైలర్ రాబోతుంది.
Full View