తాగిన మ‌త్తులో హీరోయిన్ ర‌చ్చ ర‌చ్చ‌

Update: 2017-06-03 06:19 GMT
మిగతా హాలీవుడ్ హీరోయిన్లతో పోలిస్తే జెన్నిఫర్ లారెన్స్ సినిమాల్లో కొంచెం పద్ధతిగానే కనిపిస్తుంది. సినిమాల్లో ఆమె మరీ రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసింది లేదు. బయట కూడా కొంచెం పద్ధతిగానే కనిపిస్తూ ఉంటుంది ఈ భామ. ఐతే ఇటీవల ఓ నైట్ క్లబ్బులో ఆమె ప్రవర్తించిన తీరు.. రెచ్చిపోయిన వైనం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తన టాప్ విప్పేసి.. లో దుస్తులతో పోల్ డ్యాన్స్ చేయడం సంచలనం రేపింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి జెన్నిఫర్ ప్రియుడైన డైరెక్టర్ డారెన్ అరోనోస్కీ ఆమె నుంచి తెగతెంపులు చేసుకున్నట్లుగా వార్తలు వస్తుండటం విశేషం.

జెన్నీఫర్ ‘ద రెడ్ స్పారో’ అనే సినిమా షూటింగ్ కోసం ఆస్ట్రియా వెళ్లింది. ఆ సినిమాకు తన బాయ్ ఫ్రెండు డారెనే దర్శకుడు. ఐతే షూటింగ్ అయ్యాక రాత్రి పూట ఆమె ఓ నైట్ క్లబ్‌ కు వెళ్లింది. అక్కడ స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంది. ఆ సందర్భంగా ఆమె పరిమితికి మించి మద్యం తాగింది. ఆ మత్తులో ఏం చేస్తోందో తెలియక అక్కడి స్ట్రిప్పర్ పోల్‌ ను పట్టుకుని డాన్స్ చేసింది. అంతటితో ఆగకుండా ఒంటి మీదున్న జాకెట్‌ ను కూడా తీసి పారేసి.. లో దుస్తులతో అర్ధనగ్నంగా డ్యాన్స్ చేసింది. ఓ వ్యక్తితో కలిసి ఫ్లోర్‌ మీద అటు ఇటు పాకేసింది కూడా. దీనికి సంబంధించిన వీడియోను రాడార్ ఆన్‌ లైన్ అనే మీడియా సంస్థ ప్రసారం చేసింది. ఎప్పుడూ పద్ధతిగా కనిపించే జెన్నిఫర్ ఇలా రెచ్చిపోవడం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఆమె ప్రియుడు తనకు టాటా చెప్పేసినట్లు మీడియాలో కథనాలు మొదలయ్యాయి. ఐతే ఈ వీడియోకు సంబంధించి తనకు రిగ్రెట్స్ ఏమీ లేవంటోంది జెన్నిఫర్. తాను స్ట్రిప్పర్ పోల్‌ మీద డాన్స్ చేసిన విషయాన్ని నాకెవరూ గుర్తు చేయాల్సిన అవసరం లేదని.. తనకు అత్యంత ఆప్తులైన స్నేహితులతోనే ఆ పార్టీ జరిగిందని.. అన్నీ మరిచిపోయిన తాను తన్మయత్వంలోకి వెళ్లిపోయానని.. బాగా ఎంజాయ్ చేశానని.. ఈ విషయంలో ఎవరికీ క్షమాపణ చెప్పనని.. ఆ అవసరం లేదని అంది జెన్నిఫర్.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News