బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇటీవలే అమెరికా నుంచి ముంబైలో ల్యాండ్ అయింది. కొద్ది రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి అమెరికాలోని తన సోదరి ఖుషీ కపూర్ తో గడిపింది. ఆమెరికా మొత్తాన్ని సోదరితో కలిసి అలా ఓ రౌండ్ వేసి వచ్చింది. ప్రస్తుతం మళ్లీ షూటింగ్ కి ప్రిపేర్ అవుతోంది. ఎంజాయ్ మూడ్ నుంచి వర్క్ మోడ్ లోకి రావడానికి సన్నద్దం అవుతోంది. రేపే మోపో యథావిధిగా దోస్తానా-2 సెకెండ్ షెడ్యూల్ లో జాయిన్ కావాల్సి ఉంది.
అయితే ఆమెరికా వెళ్లినప్పుడు మిస్సయిన తినుబండారలన్నింటిని అమ్మడు తీరిగ్గా ఇప్పుడు కవర్ చేసేస్తోంది. అమెరికా నుంచి ముంబైలో కాలు పెట్టుగానే బిర్యాని రుచి చూసింది. తన స్నేహితులతో కలిసి ఇలా బిర్యాని టేస్ట్ చేస్తోన్న ఫోటోలను అభిమానులకు షేర్ చేసి ఇది బిర్యానీ పార్టీ అంది. తన ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా బిర్యానీ లొట్టలేసుకుని మరీ లాగించేసారు. జాన్వీ బిర్యానీ తింటోన్న సమయంలో ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.
గతేడాది ధడక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఈ ఏడాది మాత్రం ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. కొత్త సంవత్సరంలో మాత్రం జాన్వీ నటించే సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 2020 క్యాలెండర్ నిండింది. ప్రస్తుతం కొన్ని సినిమాలు సహా వెబ్ సిరీస్ లు చేతిలో ఉన్నాయి. అందులో ఒకటి దోస్తానా-2 సినిమా సెట్స్ లో ఉంది. ఇటీవల తొలి షెడ్యూల్ పూర్తయింది. రెండవ షెడ్యూల్ కి టీమ్ రెడీ అవుతోంది.