టాలీవుడ్ - బాలీవుడ్ మరే వుడ్ అయినా కూడా సినిమాలకు లేదంటే సెలబ్రెటీలకు హైప్ చాలా అవసరం. చిన్నదాన్ని కూడా పెద్దగా చూపించినప్పుడే అందరి దృష్టి ఆకర్షించగలరు. అందుకే సినిమాల విడుదల సమయంలో మేకర్స్ చేసే ప్రమోషన్స్ కొన్ని సార్లు భారీ హైప్ ను క్రియేట్ చేస్తాయి. తీరా సినిమా చూస్తే అందులో మ్యాటర్ ఏమీ ఉండదు. ఇక కొందరు నటీ నటులు పెద్దగా అవకాశాలు లేకున్నా కూడా తాను అంత బిజీ - ఇంత బిజీ అంటూ ఇంటర్వ్యూలో చెబుతూ వస్తారు. అవకాశాలు లేవు అంటే వచ్చే అవకాశాలు కూడా ఎక్కడ రావో అనే భయంతో తమను తాము హైప్ చేసుకునేందుకు కొందరు సెలబ్రెటీలు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. తాజాగా జాన్సీ కపూర్ కూడా హైప్ కోసం ప్రయత్నాలు చేస్తోంది.
అతిలోక సుందరి శ్రీదేవి మరణం తర్వాత అందరి దృష్టి ఆమె కూతురు జాన్వీ కపూర్ పైకి మళ్లింది. తల్లి స్థానంను జాన్వీ రీప్లేస్ చేయగలదా అంటూ అంతా ఎదురు చూశారు. అలాంటి సమయంలోనే ‘ధడక్’ అనే హిందీ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ధడక్ చిత్రం యావరేజ్ మూవీగా నిలవడంతో పాటు, జాన్వీకి జస్ట్ పాస్ మార్కులు పడ్డాయి. ధడక్ చిత్రం తర్వాత జాన్వీ కేవలం ఒకే ఒక్క సినిమాకు కమిట్ అయ్యింది. ఆ చిత్రం షూటింగ్ జరుగుతుంది, మరో సినిమా చర్చల దశలో ఉంది. ఇలాంటి సమయంలో తన తండ్రి బోణీ కపూర్‌కు జాన్వీ కపూర్ డేట్లు లేవు అంటూ నో చెప్పిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
తాజాగా బోణీ కపూర్ ఒక చిత్రం నిర్మించేందుకు జాన్వీ కపూర్ డేట్లు అడగడం జరిగిందని, కాని జాన్వీ బిజీగా ఉండటం వల్ల తండ్రికి డేట్లు ఇవ్వలేక పోయిందని మీడియాలో జాన్వీ పీఆర్ టీం ప్రచారం చేస్తున్నారు. కేవలం ఒక్క సినిమాను చేస్తున్న జాన్వీ అంత బిజీగా ఉందా అంటూ బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. జాన్వీ కపూర్ ను హైప్ చేసేందుకు పీఆర్ టీం ఇలాంటి ఫేక్ ప్రకటనలు చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కెరీర్ ఆరంభంలోనే ఇంతటి ఫేక్ హైప్ అవసరమా అంటూ కొందరు జాన్వీని ప్రశ్నిస్తున్నారు.