ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలు, టైర్-2 హీరోలు, సీనియర్ స్టార్స్ ఇలా అందరూ రెండు, మూడు సినిమాలను చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. కానీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు. ఈ ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ కు సేమ్ టు సేమ్ పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ దాదాపు నాలుగేళ్ల తర్వాత `ఆర్ఆర్ఆర్`తో ప్రేక్షకులను పలకరించాడు. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ.. మార్చి 25న అట్టహాసంగా విడుదలై అఖండ విజయం సాధించింది.
ఈ సినిమాతో ఎన్టీఆర్ నేషనల్ వైడ్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాగే `ఆర్ఆర్ఆర్` అనంతరం కొరటాల శివతో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. ఆయనకు ఇది 30వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను ప్రకటించారు.
నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో నిర్మితం కానున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.
అయితే ఈ సినిమాను ప్రకటించి ఏడాది పూర్తైంది. కానీ, ఇప్పటి వరకు సెట్స్ మీదకు మాత్రం వెళ్లలేదు. `ఎన్టీఆర్ 30`కి సంబంధించి రోజుకో వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.. అయినా సరే చిత్ర టీమ్ నోరు విప్పడం లేదు. షూటింగ్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వడం లేదు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అవ్వకపోవడమే షూటింగ్ డిలేకు కారణమని అంటున్నారు. పోని ఈ సినిమాను పక్కన పెట్టి, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ తో కంటిన్యూ అవుదామంటే.. ఆయన `సలార్`తో బిజీగా ఉన్నాడు. దీంతో చేసేదేమీ లేక ఎన్టీఆర్ ఇంట్లో కాలక్షేపం చేస్తున్నాడు.
ఇక బన్నీ విషయానికి వస్తే.. ఈయన గత ఏడాది డిసెంబర్ లో సుకుమార్ రూపొందించిన `పుష్ప`తో ఇండియన్ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేశాడో తెలిసిందే. అయితే ఇప్పుడు `పుష్ప ది రైజ్`కు పార్ట్ 2గా `పుష్ప ది రూల్` రాబోతోంది. కథ, స్క్రిప్ట్ రెడీ అయ్యాయి. ఫిబ్రవరిలో షూటింగ్ అని మేకర్స్ అనౌన్స్ కూడా చేశారు.
కానీ, ఫిబ్రవరి దాటి ఐదు నెలలు గడుస్తున్నా పార్ట్ 2 మాత్రం పట్టాలెక్కలేదు. మొదటి భాగం సాధించిన విజయంతో.. పార్ట్ 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే సుకుమార్ ఆ అంచనాలను రీచ్ అయ్యేందుకు గత కొద్ది నెలల నుండి స్క్రిప్ట్ లో పలు మార్పులు చేర్పులు చేస్తూనే ఉన్నాడు. దీంతో బన్నీ ఈ ప్రాజెక్ట్ ను వదల్లేక.. మరో కొత్త ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయలేక గత ఎనిమిది నెలల నుండి ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. మరి ఈ ఇద్దరు టాప్ స్టార్స్ ఇంకెప్పుడు సెట్స్ లో అడుగు పెడతారో చూడాల్సి ఉంది.