ఎన్టీఆర్ మూవీ ఫిక్స్!! మరి డబుల్ యాక్షన్‌?

Update: 2016-12-09 10:04 GMT
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో అదుర్స్ ఒకటి. నరసింహా.. చారి అంటూ తారక్ చేసిన యాక్షన్.. కామెడీని ఫ్యాన్స్ అస్సలు మర్చిపోరు. అందుకే కుదిరినప్పుడల్లా అదుర్స్ సీక్వెల్ ని తెరపైకి తెస్తారు కొందరు. జూనియర్ కూడా మళ్లీ డబుల్ రోల్ లో చేయడానికి ఆసక్తిగా ఉన్నాడు. అయితే అన్నీ కలిసోస్తే అదుర్స్ సీక్వెల్ కన్నా ముందే జూనియర్ మళ్లీ డ్యూయెల్ రోల్ లో కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయ్.

నిజానికి 'ధృవ' రిజల్టు పాజిటివ్ గానే ఉన్నా కూడా.. ముందు దర్శకుడు బాబీతో ఒక సినిమా చేసేసి.. ఆ తరువాత సురేందర్ రెడ్డి సినిమా గురించి ఎన్టీఆర్ థింక్ చేస్తాడట. ఇక అందుకు తగ్గట్లే ఇప్పుడు కళ్యాణ్‌ రామ్.. తన తమ్మడు తారక్ బాబీ తో సినిమా చేయబోతున్నాడని అఫీషియల్ గా ప్రకటించేశాడు.  ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్ జరుపుకోబోతంది. మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమాలో తారక్ రెండు పాత్రల్లో కనిపించే అవకాశాలున్నాయని రూమర్లు వినిపిస్తున్నాయి.

కామెడీ-యాక్షన్ మిక్డ్స్ పక్కా పవర్ ఫుల్ మాస్ స్టోరీ కావడంతో ఈ సినిమాలో డబుల్ రోల్ చేయాలని ఎన్టీఆర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడని.. అందుకే ప్రాజెక్టుకు ఓకె చెప్పాడని అంటున్నారు. అనుకున్న రేంజులో రూపొందించి ఈ సినిమాను బ్లాక్ బస్టర్ బస్టర్ చేస్తే.. దర్శకుడిగా బాబీ జాక్ పాట్ కొట్టడమే కాదు.. జూనియర్ ఫ్యాన్స్ కి కూడా జనతా గ్యారేజ్ తరువాత డబుల్ ఫీస్టే.
Tags:    

Similar News