ఫోటోటాక్ : క్లాసీ లుక్ లో మాస్ హీరో

Update: 2022-10-20 11:30 GMT
టాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరోల్లో మాస్ హీరో ఎవరు అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ఎన్టీఆర్‌ అనడంలో సందేహం లేదు. అలాంటి ఎన్టీఆర్ ను ఇలా క్లాసీ లుక్ లో చూడం ఆశ్చర్యంగా ఉందని.. చాలా ఆనందంగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఈ ఫోటోలు ఎన్టీఆర్‌ పై అభిమానం మరింతగా పెరిగేలా చేస్తున్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఇటీవల ఎన్టీఆర్‌ కాస్త బరువు పెరిగినట్లుగా అనిపిస్తున్నాడని.. ఆయన లుక్ ఏ మాత్రం సరిగా లేదు అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్న ఈ సమయంలో తాజాగా ప్రముఖ ఫోటోగ్రాఫర్ కమలేష్‌ షేర్‌ చేసిన ఈ ఫోటోలు నందమూరి అభిమానులకు ఫుల్‌ గా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ లుక్ భలే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తో అంతర్జాతీయ స్థాయిలో స్టార్ గా నిలిచిన ఎన్టీఆర్‌ తాజాగా జపాన్ మీడియా ముందుకు సినిమా ప్రమోషన్ నిమిత్తం వెళ్లాడు.

ఆ సందర్భంగా తీసిన ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎన్టీఆర్ కూల్‌ అండ్ స్మైలింగ్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఎన్టీఆర్‌ తదుపరి సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎన్టీఆర్‌ తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా లో ఎన్టీఆర్‌ లుక్‌ ఇలాగే ఉండి.. క్లాసీ పాత్రలో కనిపిస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నానరు. మరి కొరటాల ఎలా చూపించబోతున్నాడో.. ఆ తర్వాత ఎన్టీఆర్ ను ప్రశాంత్‌ నీల్ ఎలా చూపించబోతున్నాడో తెలియాలంటే మరి కొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News