పవన్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా

Update: 2015-09-08 07:38 GMT
ఇండియాలో టాప్‌-5 స్టార్లలో సల్మాన్‌, షారూక్‌ ఖాన్‌ పేర్లు ఉంటాయి. అయితే వీళ్ల కంటే తమిళ స్టార్‌ అజిత్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ అసాధారణం అని చెబుతున్నాడు విలన్‌ కబీర్‌ సింగ్‌. జిల్‌ సినిమాతో ఇతడు తెలుగు తెరకి పరిచయం అయ్యాడు. ప్రస్తుతం అజిత్‌ సినిమా తళా 56లో విలన్‌ గా నటిస్తున్నాడు. అజిత్‌ తర్వాత మరో సౌత్‌ స్టార్‌ తో నటిస్తున్నా. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సర్‌ సర్ధార్‌ గబ్బర్‌ సింగ్‌ లో ఛాన్సొచ్చింది. పవన్‌ ని కలవడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.. అని చెప్పాడు కబీర్‌.

ఒక్క జిల్‌ సినిమాతో డజను అవకాశాలు అందుకున్న ఈ విలన్‌ స్వస్థలం ఫరీదాబాద్‌ (ఉత్తరాది). అక్కడ విలేజీ లో అమ్మా నాన్న నేను నటించిన తెలుగు సినిమాలు చూసి ఫోన్‌ చేస్తున్నారు. వాళ్లతో అలా మాట్లాడుతున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది.. అని ఎమోషన్‌ అయ్యాడు ఈ విలన్‌. మీకు ఇన్ని అవకాశాలు రావడానికి మీలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అని ప్రశ్నిస్తే .. మిగతా విలన్ల కంటే ఎక్స్‌ క్లూజివ్‌ గా కనిపిస్తా. స్టయిలిష్‌ విలన్‌ ని అని కాన్ఫిడెంటుగా చెబుతున్నాడు.  ప్రదీప్‌ రావత్‌, షాయాజీ షిండే, ముకుల్‌ దేవ్‌, ఆశిష్‌ విద్యార్థి.. వీళ్లందరి కంటే తనలో ఏం ప్రత్యేకత ఉందో కబీర్‌ జీ పెర్ఫామెన్స్‌ తో చూపించే ప్రయత్నంలో ఉన్నాడు.

మొత్తానికి జిల్‌ సినిమాలో మనోడి రోల్‌ క్లిక్‌ అవ్వడంతో ఇప్పటికప్పుడు చేతిలో 10 సినిమాలున్నాయట. అంతకంటే ఇంకేం కావాలి.

Tags:    

Similar News