ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చూసి చూడు అనేది ఎప్పటి నుంచో ఉన్నమాట. లైఫ్ లో ఈ రెండూ చాలా ఇంపార్టెంట్. అయితే ఇల్లు కట్టడం వరకు ఓకేకానీ పెళ్లి మాటెత్తితే మాత్రం మన సీనియర్ హీరోయిన్లు ఇంకా టైముందంటూ మాట దాటేస్తూ వస్తున్నారు. కాజల్ - తాప్సీ చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్నా ఈ మధ్య రేసులో కాస్త వెనుకబడ్డారు. కానీ రీసెంట్ గా నేనే రాజు నేనే మంత్రితో కాజల్ - ఆనందో బ్రహ్మతో తాప్సీ టాలీవుడ్ లో రిమార్కబుల్ హిట్లను సొంతం చేసుకున్నారు.
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు దశాబ్దం కావస్తోంది. ఆమెను చెల్లెలు నిషా అగర్వాల్ కూడా సినిమాల్లోకి వచ్చినా నాలుగైదు సినిమాలు చేసి తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలయిపోయింది. నీ సంగతేమిటని కాజల్ ను అడిగితే నాకు నచ్చే మగాడు ఇంకా కనిపించనే లేదంటోంది. ‘నా అభిరుచులకు తగ్గవ్యక్తి కనిపిస్తే వెంటనే పెళ్లి చేసుకుంటా. ఇప్పటికైతే సినిమాయే నాకు సర్వస్వం’ అని చెబుతోంది.
కాజల్ పెళ్లి కబుర్లిలా ఉంటే తాప్సీయేమో తన సొంతింటి కల నెరవేర్చుకున్నానంటోంది. రీసెంట్ గా తాప్సీ ముంబయిలోని పోష్ ఏరియా అంధేరిలో ఓ త్రీ బెడ్ రూం అపార్ట్ మెంట్ కొనుక్కుంది. అయితే ఆమె హైదరాబాద్ లో ఇంకో అపార్ట్ మెంట్ కొంటుందట. చుట్టూ గ్రీనరీ వాతావరణంలో ఇల్లు ఉండాలనేది తన కోరికని.. అది ముంబయిలో తీరదు కాబట్టి హైదరాబాద్ లో కొనుక్కుంటానంటోంది.