హీరోయిన్ల హాహాకారాలు

Update: 2018-12-11 04:14 GMT
గత శుక్రవారం తెలుగులో ఒకటికి నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో ఏదీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. ఉన్నంతలో ‘కవచం’కు ఓపెనింగ్స్ ఓ మాదిరిగా వచ్చాయి. మిగతా మూడు సినిమాల పరిస్థితి దయనీయం. టాక్ సంగతి చూస్తే.. అన్నింటికీ నెగెటివే. ఈ విషయంలో ఒకదాంతో ఒకటి పోటీ పడ్డాయి. అందరూ కొత్త వాళ్లు కలిసి చేసిన ‘శుభలేఖలు’ గురించి అసలు డిస్కషనే లేదు. మిగతా మూడు సినిమాలకూ దారుణమైన టాకే వచ్చింది.

ఈ మూడు సినిమాలపై ఆశలు పెట్టుకున్న పరిస్థితి అసలే కష్టంగా ఉంటే.. వీటి ఫలితాలు వాళ్ల కెరీర్లపై మరింత ప్రభావం చూపేలా ఉన్నాయి. ఆల్రెడీ తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు ఆగిపోయిన కాజల్ అగర్వాల్.. రానా దగ్గుబాటి.. కళ్యాణ్ రామ్.. బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి తన రేంజికి తగని హీరోలతో జత కడుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ తో కాజల్ నటించడం ఆమె అభిమానులకు అసలు రుచించలేదు. దీనికి తోడు ‘కవచం’ డిజాస్టర్ టాక్ తెచ్చుకుని ఆమెకు అన్ని రకాలుగా చేటే చేసింది. కాజల్ తర్వాతి సినిమా కూడా బెల్లంకొండ శ్రీనివాస్ తోనే కావడం గమనార్హం. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా తెలుగులో కాజల్ కెరీర్ క్లోజే అనిపిస్తోంది.

ఇక ‘కవచం’ మీద కాజల్ కంటే చాలా ఆశలే పెట్టుకుంది మెహ్రీన్. అసలే ఆమె హ్యాట్రిక్ ఫ్లాపులతో అల్లాడుతోంది. ఇప్పుడు ‘కవచం’ కూడా ఆమెను ముంచేసింది. దీంతో ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడిపోయి మరో అవకాశం దక్కడం కష్టంగా ఉంది. ఇక ‘నెక్స్ట్ ఏంటి’ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తమన్నాకూ తీవ్ర నిరాశ తప్పలేదు. ఆ సినిమా చూసిన జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక ‘సుబ్రహ్మణ్యపురం’తో కెరీర్ మలుపు తిరుగుతుందని ఆశించిన ఈషా రెబ్బాకు ఆ చిత్రం షాకిచ్చింది. అది ఏ రకంగానూ ఆమెకు ఉపయోగపడేలా లేదు. మొత్తానికి గత వారం సినిమాల దెబ్బకు ఈ హీరోయిన్ల కెరీర్లే క్లోజ్ అయిపోయే పరిస్థితి వచ్చింది.

Tags:    

Similar News