టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ 9 ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతోంది. ఈ సమయంలో అందరి బడా స్టార్లతో సినిమా చేసిన కాజల్ కి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసే అవకాశం మాత్రం సర్దార్ గబ్బర్ సింగ్ తోనే వచ్చింది. ఈ ఒక్క సినిమాతో.. కాజల్ కవర్ చెయ్యని స్టార్ హీరో లేడనే ట్యాగ్ ను అందుకుంది.
సాధారణంగా పవన్ ని అందరూ రిజర్వడ్ పర్సన్ అంటారని, తాను కూడా అలాగే అనుకున్నానన్న కాజల్ అగర్వాల్.. అసలు విషయం మాత్ర షూటింగ్ స్టార్ట్ అయ్యాకే తెలుసుకుందట. పవన్ లో ఉన్న సెన్సాఫ్ హ్యూమర్ కి ఫ్లాట్ అయిపోయిందట కూడా. అలాగే ప్రతీ ఒక్కరి గురించి పవన్ తీసుకునే కేర్ కి హ్యాట్సాఫ్ అంటోంది. 'స్టిట్జర్లాండ్ లో చాలా చల్లటి ప్రాంతంలో షూట్ చేశాం. ఆ చలి తట్టుకోలేని స్థాయిలో నా కాస్ట్యూమ్స్ ఉండేవి. అందుకే షాట్ అయిపోగానే.. ప్రతీసారీ గట్టిగా అరిచి మరీ బ్లాంకెట్స్ తెప్పించి కప్పించేవారు పవన్. ఆ చలిని తట్టుకోవడానికి తన హాట్ వాటర్ బాటిల్ ని కూడా నాకే ఇచ్చేసేవారు' అంటోంది చందమామ.
హిందీ ఆడియన్స్ కి సర్దార్ గబ్బర్ సింగ్ తప్పుకుండా నచ్చుతుందని అంటోంది కాజల్. ఇప్పటికే హిందీలో తగినంత గుర్తింపు ఉన్న కాజల్ ఈ మూవీలో హీరోయిన్ గా ఉండడం.. సర్దార్ ఓపెనింగ్స్ కి కలిసొచ్చే విషయమే.