కళ్యాణ్ రామ్ సరికొత్తగా..

Update: 2018-03-16 06:36 GMT
ఒక్క హిట్ అందిందంటే చాలు హీరోలకు ఎంత ఆనందం ఉంటుందో అదే స్థాయిలో కొంచెం ఆందోళన భయం కూడా ఉంటుంది. ఎందుకంటే విజయం తరువాత వచ్చే సినిమా కోసం ఆడియెన్స్ అంచనాలు ఓ రేంజ్ లో పెరుగుతాయి. ఆ స్థాయిని తెలుసుకోవాలంటే ఎవ్వరికైనా కష్టమే. దీంతో ఒక్కోసారి ఊహించని విధంగా అపజయాలు అందుతాయి. అందుకే మన హీరోలు లుక్స్ తో ప్రయోగాలు చేస్తున్నారు.

సినిమా సినిమాకు స్టైల్ లో మార్పు తెస్తుండడం ఈ మధ్య కాలంలో ట్రెండ్ గా మారింది. అవసరం అయితే సిక్స్ ప్యాక్ కి కూడా సిద్దమనేస్తున్నారు. ఆ లిస్ట్ లో ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా చేరిపోయాడు. పటాస్ సినిమాలో తన కామెడీ టైమింగ్ లో సరికొత్తగా కనిపించిన కళ్యాణ్ రామ్ అప్పటి నుంచి వినూత్న ప్రయోగాలు చేస్తున్నాడు. ముఖ్యంగా ఇజం సినిమా కోసం సిక్స్ పెంచేసిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యే పాత్ర కోసం కూడా కళ్యాణ్ రామ్ సరికొత్త ప్రణాళికలతో తన స్టైల్ లో మార్పులు చేసుకున్నాడట.

బృందావనం సినిమాలో తన సోదరుడి స్టైల్ ని స్ఫూర్తిగా తీసుకున్నట్లు చెప్పాడు. ఇకపోతే నటనలో కూడా భారీ మార్పులే చేశాడట. ఎమ్మెల్యే సినిమాలో కామెడీ ఎక్కువగా ఉడడంతో పాటు దానికి తగ్గట్టుగా లవ్ రొమాన్స్ కూడా గట్టిగానే ఉంటుందని టాక్. ప్రస్తుతం సినిమాకు సంబందించిన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కటౌట్స్ కూడా రెడీ చేయించుకుంటున్నారు. ఉపేంద్ర దర్శకత్వం వహించిన ఎమ్మెల్యే సినిమా నెక్స్ట్ వీక్ రిలీజ్ కానుంది.  
Tags:    

Similar News