గత సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా చాలా మంది హీరోల అప్ కమింగ్ సినిమాలకు ఈ మధ్య క్రేజ్ బాగా పెరిగిపోతోంది. చిన్న విషయం పాజిటివ్ గా ఉన్నప్పటికి సినిమా రేంజ్ తార స్థాయికి చేరుతోంది. ఇక కెరీర్ లో ఇంకా భారీ విజయాల కోసం ప్రయత్నాలు చేస్తోన్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సినిమాకు కూడా డిమాండ్ పెరగడం ఇప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు నిజంగానే ఉహించని విధంగా ఆ సినిమా బిజినెస్ నడుస్తోందా అనిపిస్తోంది.
శ్రీను వైట్ల దగ్గర ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి డైలాగులు అంధించిన రచయిత ఉపేంద్ర దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే (మాంచి లక్షణాలున్న అబ్బాయి)అనే సినిమాను చేస్తున్నాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఆ సినిమాకు ఇప్పుడు భలే డీల్ దక్కింది. శాటిలైట్ అండ్ డిజిటల్ అండ్ థియేటర్ రైట్స్ అన్నీకలిపి విడుదలకు ముందే 20 కోట్ల బిజినెస్ చేసిందని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఏ సినిమాకు ఈ స్థాయిలో 20 కోట్ల డిమాండ్ అనేదే రాలేదు. మనోడు ఈ మధ్య కాలంలో పటాస్ తప్పితే మరో సినిమాతో హిట్టు కొట్టకపోయినా కూడా.. డిజిటల్ స్పేస్ లో పెద్ద పెద్ద ప్లేయర్లు దిగడం చేత ఇంతేసి డిమాండ్లు వస్తున్నాయని అనుకోవచ్చు.
కాకపోతే మనోడు ఇలాంటి అంచనాలను ధియేటర్లలో అందుకుంటాడా అన్నదే చూడాల్సిన విషయం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇటువంటి మైండ్ బ్లోయింగ్ డీల్స్ అందుకున్న సినిమాలు చాలావరకు డీల్స్ వరకే అద్భుతంగా సినిమా పరంగా డల్ గా తేలిపోయాయ్. ఇకపోతే సినిమాను మార్చ్ 23న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఇప్పటివరకు తెలుగులో ఎవరు షూట్ చేయని విదేశాల్లో పాటలని షూట్ చేస్తున్నారట. అది సంగతి.