ఎన్టీఆర్ బయోపిక్ టీజర్ షూటింగ్ లో ఉండగానే కొత్త కొత్త సంగతులతో ఆసక్తి రేపుతోంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత కథను సంపూర్ణంగా వెండితెరపై ఆవిష్కరించే దిశగా చేస్తున్న ప్రయత్నం కాబట్టి ఏ విషయంలోనూ రాజీ పడేందుకు ఇటు హీరో బాలకిష్ణ అటు దర్శకుడు తేజ ఇద్దరు సిద్ధంగా లేరు. ప్రతిది క్షుణ్ణంగా పరిశీలిస్తూ పాత్రల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ బాల్యం గురించి కూడా కొన్ని సీన్స్ ఉంటాయట. అందులో ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన బాలుడైతేనే ఎఫెక్ట్ బాగుంటుందని తేజ చెప్పడంతో కళ్యాణ్ రామ్ అబ్బాయి శౌర్య రామ్ ని దీనికి ఎంచుకున్నట్టు వార్త. షూటింగ్ కూడా రేపే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. శౌర్య రామ్ కు నటన కొత్త కాదు. నాన్న కళ్యాణ్ రామ్ నటించిన ఇజంలో అతని చిన్నప్పటి పాత్ర పోషించాడు.
ఇది శౌర్య రామ్ కు రెండో సినిమా అవుతోంది. కళ్యాణ్ రామ్ కూడా తన కెరీర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టిన వాడే. 1989లో బాలకృష్ణ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ బాలగోపాలుడు సినిమాలో బాబాయ్ తో పోటాపోటీగా నటించాడు. ఇప్పుడు తన కొడుకు అదే బాలయ్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పాత్ర వేయటం తండ్రిగా కళ్యాణ్ రామ్ కు ఎలాంటి థ్రిల్ ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శౌర్య వేస్తోంది చిన్నప్పటి ఎన్టీఆర్ రోల్ కాబట్టి బాలకృష్ణతో కాంబో సీన్లు ఉండవు. అదొక్కటే మిస్ అవుతాడు. జనవరి 18న టీజర్ విడుదల చేసే ఉద్దేశంతో ఫుల్ స్వింగ్ లో వర్క్ చేస్తోంది సినిమా యూనిట్. అందుకే అవసరం ఉన్నా కూడా బాలయ్య జైసింహ ప్రమోషన్ కు వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నారు.