యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ తన నట జీవితంలో ఎన్నో వైవిధ్యభరిత పాత్రల్లో నటించాడు. ఒకే సినిమాల్లో పది పాత్రల్లో నటించి మెప్పించిన ఘనత కేవలం కమల్ హాసన్ కు మాత్రమే దక్కింది. ఇండియన్ సినీ చరిత్రలో కమల్ హాసన్ కు ప్రత్యేక స్థానం రాబోయే వందేళ్ల వరకు కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదు. అలాంటి కమల్ హాసన్ తాజాగా విక్రమ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ సినిమా ఇటీవలే విడుదల అయ్యి మొదటి రెండు రోజుల్లోనే వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మరో వైపు మొదటి నాలుగు రోజుల్లో తమిళనాడు మరియు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ను సాధించింది. ఓవర్సీస్ తో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకు పోతుంది.
తాజాగా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక జాతీయ మీడియా సంస్థతో కమల్ హాసన్ మాట్లాడుతూ తన ఆగిపోయిన చిత్రం శభాష్ నాయుడు గురించి ఆసక్తికర విషయాన్ని వెళ్లడించాడు. కమల్ సొంత ప్రొడక్షన్ హౌస్ లో కొన్నాళ్ల క్రితం ప్రారంభం అయిన శభాష్ నాయుడు సినిమా నిలిచి పోయిన విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ కొంత మేరకు జరిగిన తర్వాత క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఏంటీ అనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు.
మళ్లీ ఆ సినిమా ఉంటుందని ఎవరు అనుకోలేదు. కాని తాజాగా కమల్ హాసన్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తప్పకుండా శభాష్ నాయుడు సినిమాను తీసుకు వస్తాను అంటూ ప్రకటించారు. ప్రస్తుతానికి ఆ సినిమా రైట్స్ తన వద్దే ఉన్నాయని.. ఆ సినిమా ను మళ్లీ మొదలు పెట్టి పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేయబోతున్నట్లుగా కమల్ హాసన్ ప్రకటించాడు.
కమల్ హాసన్ కామెడీ సినిమాలను జనాలు బాగా ఆస్వాదిస్తారు. ఎంతటి సీరియస్ పాత్రల్లో కనిపిస్తాడో కామెడీ పరంగా అంతటి నటనతో టైమింగ్ తో ఆకట్టుకుంటాడు. అందుకే శభాష్ నాయుడు తప్పకుండా కామెడీ పరంగా కమల్ హాసన్ ను మరోసారి అందరికి చేరువ చేస్తుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కమల్ హాసన్ శభాష్ నాయుడు తెలుగు వర్షన్ లో కమల్ హాసన్ నటించబోతున్నట్లుగా అప్పట్లో పోస్టర్ కూడా వేశారు. కాని సినిమా క్యాన్సిల్ అవ్వడంతో బ్రహ్మీ అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు శభాష్ నాయుడు గురించి స్వయంగా కమల్ హాసన్ మాట్లాడటంతో అంతా కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. విక్రమ్ సక్సెస్ జోరులో ఉన్న కమల్ నాయుడు సినిమాను తీసుకు వస్తాడేమో చూడాలి.