గౌతమి-శృతి మధ్య నలిగిపోతున్న కమల్

Update: 2016-07-05 06:41 GMT
రియల్ లైఫ్ వేరు.. రీల్ లైఫ్ వేరు.. అలాగే నిజజీవితంలో సాధారణంగా మగవాళ్లు అత్తాకోడళ్ల నలిగే సందర్భాలు చాలానే ఉంటాయి. కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం లెక్కలు వేరుగా ఉంటాయి. ఇక్కడ చాలాచోట్ల భాగస్వాములు.. పిల్లల మధ్య నలగాల్సిన పరిస్థితి హీరోలకు వస్తూ ఉంటుంది. మొదటి పెళ్లిని కాదని.. వేరొకకరితో జీవిస్తున్న వారి సంఖ్య ఎక్కవగా ఉండడమే ఇందుకు కారణం. ఇప్పుడు విశ్వనటుడు కమల్ హాసన్ కు కూడా.. ఈ తరహా గొడవలు తప్పడం లేదనే టాక్ వినిపిస్తోంది.

కమల్ ప్రస్తుతం గౌతమితో సహజీవనం చేస్తున్నాడు. కమల్ హాసన్ మొదటి భార్య సారిక కూతురు అయిన శృతి హాసన్ కి.. గౌతమి వరుసకు పిన్ని అవుతుందనే విషయం తెలిసిందే. ఇప్పటివరకూ కమల్ - శృతి హాసన్ లు కలిసి పని చేయకపోవడంతో.. ఓ ప్రాబ్లెమ్ ఎదురు కాలేదు. కానీ మొదటిసారికా శభాష్ నాయుడు మూవీలో తండ్రీ కూతుళ్లిద్దరూ కలిసి నటిస్తున్నారు. సాధారణంగా కమల్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా గౌతమి వ్యవహరిస్తుంది. ఈ సినిమాకి కూడా కాస్ట్యూమ్స్ బాధ్యతలను ఆమే చూసుకుంటోంది. అసలు సమస్య ఇక్కడే మొదలవుతోంది. గౌతమి సూచించిన కాస్ట్యూమ్స్ పై శృతి హాసన్ చీటికీ మాటికీ చిరాకు పడుతోందని.. రిజెక్ట్ చేస్తోందని అంటున్నారు.

కమల్ హాసన్.. శృతి హాసన్ లు పక్కా ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తారనే టాక్ ఉంది. కానీ మొదటిసారిగా శృతి నుంచి ఇలాంటి రియాక్షన్స్ వస్తున్నాయని యూనిట్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కమల్ చేస్తున్న ప్రయత్నాలు అంతగా సక్సెస్ కావడం లేదట. మరి ఈ సమస్యను అధిగమించి శభాష్ నాయుడిని ఎలా పూర్తి చేస్తాడో కమల్!
Tags:    

Similar News