విశ్వనటుడికి ఫ్రెంచ్ పురస్కారం

Update: 2016-04-01 03:32 GMT
భారతీయ సినిమా రంగం గర్వించదగ్గ మహానటుడు కమల్ హాసన్. 50 ఏళ్ల తన కెరీర్ లో ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు - రివార్డులు - ప్రశంసలు అందుకున్న ఈ విశ్వనటుడి కీర్తి కిరీటంలో ఇప్పుడో మరో మణిహారం చేరింది. ఫ్రెంచ్ ప్రభుత్వం అందించే ఓ విశిష్టమైన అవార్డును లోకనాయకుడు అందుకున్నారు.

తాజాగా హెన్రీ లాంగ్లోయిస్ అవార్డును కమల్ అందించింది ఫ్రాన్స్ ప్రభుత్వం. పారిస్ లో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా పలువురు సినీ దిగ్గజాలు హాజరయ్యారు. ఈ విశిష్ట అవార్డు దక్కించుకున్న ఆనందాన్ని అభిమానులతో ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు కమల్. “పారిస్ లో హెన్రీ లాంగ్లోయిస్ అవార్డ్ అందుకన్నాను. నా గురు అనంతు సార్ ఈ వార్త వినేందుకు బతికి ఉంటే బాగుండేదని అనిపించింది. ఆయన ద్వారానే నేనీ అవార్డు గురించి తెలుసుకున్నాను” అంటూ ట్వీట్ చేశారు కమల్ హాసన్.

సినీ రంగానికి, నిర్మాణానికి కమల్ హాసన్ చేసిన ఎనలేని సేవలకు గాను ఈ అవార్డ్ దక్కింది. హెన్రీ లాంగ్లోయిస్ కుసినిమాలను ఆర్కివ్స్ గా మార్చి భద్రపరచడంలో ఎంతో ప్రఖ్యాతులు ఉన్నాయి. సినిమాలను చిరస్థాయిగా నిలిచిపోయేలా దాచిపెట్టే వ్యవస్థను ఏర్పాటు చేసి నిర్వహించడంతో హెన్రీని... ఫాదర్ ఆఫ్ ఫిలిం ప్రిజర్వేషన్ గా చెబుతారు. ఆయన పేరుపై అందిస్తున్న విశిష్ట పురస్కారాన్నే కమల్ హాసన్ అందుకున్నారు.
Tags:    

Similar News